అక్టోబర్ 15 నుండి అమెరికాలో మహేష్ బాబు “మహర్షి” ఫోర్త్ షెడ్యూల్

Latest Telugu Movies News 2018, Maharshi Movie Shooting Updates, Maharshi Movie Updates, Maharshi Telugu Movie Latest News, Mahesh Babu Maharshi Fourth Schedule in USA from 15th October, Mahesh Babu Maharshi Movie News, Superstar Mahesh Babu Maharshi Telugu Movie Shooting Latest News, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Movie Updates
Mahesh Babu Maharshi Fourth Schedule in USA from 15th October

ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు అభిమానుల ఆలోచనలన్నీ “ మహర్షి” సినిమా చుట్టూ తిరుగుతున్నాయి . మహేష్ బాబు 25 వ సినిమా కావడంతోపాటు భరత్ అనే నేను హిట్ తరువాత వస్తున్న ఫాలో అప్ చిత్రం కావడంతో మహర్షి మీద అభిమానుల అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వార్త అభిమానుల్లో అమితమైన ఆసక్తిని నింపుతుంది. ఇంతకు “మహర్షి” చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ఎంత వరకు వచ్చాయి…? ఇప్పటికి ఎన్ని షెడ్యూల్స్ పూర్తయ్యాయి…? వర్క్ ప్రోగ్రెస్ ఏమిటి అనే వివరాల కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే అభిమానుల ఈ ఆతృతను సొమ్ము చేసుకునేందుకు కొన్ని వెబ్ సైట్స్ లో అసత్య వార్తలు వస్తున్న నేపథ్యంలో వాస్తవ వివరాలు తెలుసుకునేందుకు చిత్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజుకు ఫోన్ చేసింది “దితెలుగుఫిలింనగర్.కామ్“.

మహర్షి ప్రోగ్రెస్ ను, షెడ్యూల్స్ వివరాలను తెలియజేస్తూ దిల్ రాజు “ ఇప్పటికీ మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. డెహ్రాడూన్, హైదరాబాద్ పరిసరాల్లో జరిపిన మూడు షెడ్యూల్స్ లో 50 శాతం టాకీ, రెండు పాటల చిత్రీకరణ పూర్తయింది. అక్టోబర్ 15 నుండి నెలాఖరు వరకు పదిహేను రోజులపాటు అమెరికాలో నాలుగో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఆ షెడ్యూల్లో మహేష్ బాబు, పూజ హెగ్డే, జయసుధ గారు మరికొంతమంది ఆర్టిస్టులతో కొన్ని కీలక సన్నివేశాలు, రెండు పాటల చిత్రీకరణ జరుగుతుంది. అక్కడినుండి వచ్చాక మరలా నవంబర్ 10 నుండి సినిమా పూర్తయ్యే వరకు హైదరాబాదులో షూటింగ్ కార్యక్రమాలు జరుగుతాయి. షూటింగు ప్రారంభమైంది మొదలు అన్ని షెడ్యూల్స్ ప్లాన్ ప్రకారం అనుకున్నది అనుకున్నట్టుగా ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేయడం జరిగింది. మేము మహర్షి సినిమాను ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేస్తామని ముందే ప్రకటించాము. ఆ డేట్ కి మహర్షి ప్రేక్షకుల ముందుకు వస్తుంది… అన్నారు దిల్ రాజు.

సో ఇదీ… మహర్షి షూటింగ్ కు సంబంధించిన అఫీషియల్ అప్డేట్.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here