ఆ వార్తల్లో నిజం లేదంటున్న దిల్ రాజు

Dil Raju Clarifies on 96 Movie Telugu Remake,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Dil Raju Clarifies on Telugu Remake,Dil Raju Movie Latest News,Dil Raju Movies in Telugu Remake,Dil Raju Rights on 96 Movie,Dil Raju Wants to Remake Vijay sethupathi 96 Movie
Dil Raju Clarifies on 96 Movie Telugu Remake

త‌మిళ హీరో విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటించిన చిత్రం 96. ఈ సినిమా అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సినిమా విడుదలవ్వక మునుపే..రీమేక్ రైట్స్ ను తెలుగు స్టార్ నిర్మాత అయిన దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వారే తెలిపారు. అయితే ఎప్పుడైతే దిల్ రాజు ఈ సినిమా హక్కులు కొన్నారని…అప్పుడే పలు పుకార్లు పుట్టుకొచ్చేస్తూనే ఉన్నాయి.

ఇప్పటికే ఈ రీమేక్ లో నాని నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ రీమేక్ లో విజయ్ సేతుపతి పాత్ర‌లో నాని, త్రిష పాత్ర‌లో స‌మంత న‌టించనున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇక ఈ వార్తలపై స్పందించిన దిల్ రాజు ఓ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాపై పలు వార్తలు వస్తున్నాయి.. త్వరలోనే ఈచిత్రం లో నటించే నటీనటులను అలాగే సాంకేతిక నిపుణలను అధికారికంగా ప్రకటిస్తామని తెలియజేశారు. దీంతో ఈ వార్తలకు బ్రేక్ పడింది. మరి ఈ సినిమాలో ఎవరు నటిస్తారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేేంత వరకూ ఆగాల్సిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here