రెబల్ స్టార్స్ కెరీర్ కు టర్నింగ్ డే సెప్టెంబర్29.

29th September a Big Day in Prabhas Career, 29th September Prabhas Career Turning Day, Latest Telugu Movies 2018, Prabhas Career Latest News, Prabhas Movies Latest Updates, Rebel Star Prabhas Latest News, September 29th a Big Day in Prabhas Life, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
29th September a Big Day in Prabhas Career

రెబల్ స్టార్ కృష్ణంరాజు – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు సెప్టెంబర్ 29వ తేదీ మెమరబుల్ డే గా నిలిచిపోతుంది. ఆ ఇద్దరి కెరీర్స్ లో ఒక రోజు తేడాతో గొప్ప గొప్ప విజయవిశేషాలు చోటుచేసుకున్నాయి.ఆ వివరాలు ఏమిటో చూద్దాం.

రెబల్ స్టార్ కృష్ణంరాజు 1966లో కె.ప్రత్యగాత్మ దర్శకత్వంలో “చిలకా గోరింక ” చిత్రం ద్వారా హీరోగా పరిచయమైనప్పటికీ ఆ చిత్రం ఆశించినంత విజయవంతం కాకపోవడంతో ఆయన కెరీర్ అయోమయంలో పడింది. హీరోగా పరిచయమైన కృష్ణంరాజు విలన్ పాత్రలు కూడా అంగీకరించవలసి వచ్చింది. కెరీర్ ప్రారంభం అయ్యాక దాదాపు పదకొండు సంవత్సరాల పాటు హీరో గా, విలన్ గా రెండు రకాల పాత్రలు చేస్తూ వచ్చారు కృష్ణంరాజు. ఒక విధంగా చెప్పాలంటే పదకొండు సంవత్సరాల పాటు ఒక స్థిరమైన ఇమేజి లేకుండా కొనసాగారు కృష్ణంరాజు.

అలాంటి పరిస్థితుల్లో సొంత చిత్ర నిర్మాణ సంస్థ “గోపీకృష్ణ మూవీస్ ” ను ప్రారంభించి కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సోలో హీరోగా నటిస్తూ నిర్మించిన “అమరదీపం” అద్భుత విజయాన్ని సాధించింది. ఇక అప్పటినుండి ఒక స్టార్ గా కృష్ణంరాజుకు, సంస్థ గా గోపీకృష్ణ మూవీస్ కు ఎంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయో అందరికీ తెలుసు. అంతటి ఘన విజయాన్ని సాధించిన అమరదీపం విడుదలైంది 1977 సెప్టెంబర్ 29. అంటే ఖచ్చితంగా ఈరోజుకు నలభై ఒక్క సంవత్సరాలు పూర్తి అయ్యాయి. సో…. ఇన్ని సంవత్సరాల కృష్ణంరాజు వైభవానికి, ఆ తరువాత ఆయన వారసుడిగా వచ్చిన ప్రభాస్ సక్సెస్ఫుల్ కంటిన్యుటీ కి బీజం పడిన రోజు సెప్టెంబర్ 29.

ఇక ఈ రోజున యంగ్ రెబెల్ స్టార్ గా హిమాలయన్ హైట్స్ కు ఎదిగిన ప్రభాస్ విషయానికి వస్తే – 2002లో “ఈశ్వర్” చిత్రం ద్వారా హీరోగా కెరీర్ ప్రారంభించిన ప్రభాస్ 2005 వరకు రాఘవేంద్ర ,వర్షం ,అడవి రాముడు ,చక్రం చిత్రాలలో నటించినప్పటికీ ఒక్క “వర్షం” మాత్రమే సూపర్ హిట్ అయింది. కెరీర్ పరంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవసరమైన తరుణంలో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఛత్రపతి” ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ ను అమాంతంగా మార్చేసింది. ఈ రోజున ఇండియన్ సినిమా బాక్సాఫీస్ చరిత్రలోనే పెను సంచలనానికి కారణమైన “బాహుబలి” సిరీస్ కాంబినేషన్ కు ప్రారంభ చిత్రమైన “ఛత్రపతి”విడుదలయింది 2005 సెప్టెంబర్ 30 న.

అంటే రెబెల్ స్టార్ కృష్ణంరాజు కెరీర్ టర్నింగ్ డే సెప్టెంబర్ 29 కాగా, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కెరీర్ టర్నింగ్ డే సెప్టెంబర్ 30… అంటే కేవలం ఒకే ఒక్క రోజు తేడాతో ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు స్టార్స్ కు సెప్టెంబర్ మాసాంతం బాగా కలిసి వచ్చింది అన్నమాట. ఇది రెబల్ స్టార్ అండ్ యంగ్ రెబల్ స్టార్ లకు సెప్టెంబర్ 29 – 30 తేదీలు తో ఉన్న అనుబంధం ….
కాగా…. ఇదే రోజున … అంటే సెప్టెంబర్ 29న .. సినీ చరిత్రలో సంచలన విజయాలు గా నిలిచిన చాలా చిత్రాలు విడుదల అయ్యాయి.

సూపర్ స్టార్ కృష్ణ ఎ.మల్లికార్జున్ రావు దర్శకత్వంలో నటించిన ” రామ రాజ్యం” చిత్రం 1983 సెప్టెంబర్ 29న విడుదల అయింది.ఆ చిత్రానికి ఈ రోజుతో 35 సంవత్సరాలు పూర్తయింది. అలాగే కృష్ణ నటించిన దొంగలకు దొంగ, తెలుగువీర లేవరా చిత్రాలు కూడా ఇదే రోజున విడుదలయ్యాయి.

అలాగే అక్కినేని నాగార్జున, సౌందర్య, శిల్పా శెట్టి కాంబినేషన్లో తిరుపతి స్వామి దర్శకత్వంలో అగ్ర నిర్మాత అశ్వినీదత్ నిర్మించిన “ఆజాద్” చిత్రం విడుదలైంది కూడా ఈ రోజునే.
మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందిన మహానుభావుడు గత సంవత్సరం సెప్టెంబర్ 29న విడుదలై నేటితో సంవత్సరం పూర్తి చేసుకుంది.
ఇలా సెప్టెంబర్ 29 అనేక ఘన విజయ చిత్రాల రిలీజ్ డేట్ గా చరిత్రలో నిలిచిపోయింది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here