ఒకే ఏడాదిలో ఒకే భాషలో మూడు హ్హిట్ల హ్యాట్రిక్ కొట్టేసిన రష్మిక మందన

Actress Rashmika 3 Consecutive Hits, Latest Telugu Movies News, Rashmika Mandanna Bags 3 Consecutive Hits in Telugu, Rashmika Mandanna Latest News, Rashmika Mandanna Telugu Movie Hits, Rashmika Three Consecutive Hits in Tollywood, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates
Rashmika Mandanna Bags 3 Consecutive Hits in Telugu

సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ లో సౌత్ ఇండియన్ అమ్మాయిలు హీరోయిన్స్ గా చేస్తే నేటివిటి పరంగా చాలా సహజత్వం కనిపిస్తుంది. కానీ సౌత్ ఇండియన్ అమ్మాయిలు చాలా అరుదుగా మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అయితే ఈ సంవత్సరం ఒక బెంగుళూరు బేబీ మాత్రం తెలుగులో వరుసగా 3 ఘన విజయాలనందుకుని “హ్యాట్రిక్” కొట్టేసి మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా కెరీర్ ను ఎంజాయ్ చేస్తుంది. ఆ బెంగళూరు బ్యూటీ మరెవరో కాదు… రష్మిక మందన.

కన్నడలో 2016లో కిరాక్ పార్టీ అనే చిత్రంతో కెరీర్ ప్రారంభించి 2017 లో అంజనీపుత్ర, చమ్మక్ చిత్రాల ఘన విజయంతో అక్కడ మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక కు 2018లో టాలీవుడ్ రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పింది.
తెలుగులో ఆమె చేసిన తొలి చిత్రం ‘చలో’ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ కొత్త అమ్మాయి ఎవరు..? చాలా బాగుంది … అనుకుంటుండగానే గీత ఆర్ట్స్ వంటి పెద్ద సంస్థ ఆమెను “గీత గోవిందం” చిత్రం కోసం విజయ్ దేవరకొండ వంటి రైసింగ్ స్టార్ సరసన బుక్ చేయటంతో ఆమె డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇక గీత గోవిందం విడుదలై సంచలన విజయాన్ని సాధించి 100 కోట్ల క్లబ్బులో చేరటంతో ఆ ప్రిస్టేజియస్ విక్టరీ హీరోయిన్ గా రష్మిక మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్ అయింది. అలా వరుసగా రెండు ఘన విజయాలు సొంతం చేసుకున్న రష్మికకు ఈ రోజు విడుదలైన దేవదాస్ హ్యాట్రిక్ విక్టరీని ఇచ్చింది. దేవదాస్ కు రివ్యూ ల పరంగా మంచి టాక్ రాకపోయినప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ అని ట్రేడ్ రివ్యూలు చెప్తున్నాయి. సో…. దేవదాస్ సక్సెస్ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ బెంగళూరు బ్యూటీ సక్సెస్ఫుల్ గా హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే హైయస్ట్ పెయిడ్ హీరోయిన్ గా పేరున్న ఈ బెంగుళూర్ బ్యూటీ తాజా టారిఫ్ ను త్వరలోనే ప్రకటిస్తుందని టాలీవుడ్ టాక్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here