నవాబ్ మూవీ రివ్యూ

Latest Telugu Movie Reviews, Latest Telugu Movies 2018, Nawab Movie Live Updates, Nawab Movie Public Talk, Nawab Movie Review, Nawab Movie Review and Rating, Nawab Review, Nawab Telugu Movie Plus Points, Nawab Telugu Movie Public Response, Nawab Telugu Movie Review, Nawab Telugu Movie Story, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Nawab Telugu Movie Review

సినిమా లవర్స్ కి మణిరత్నం సినిమాలంటే అదొక క్రేజ్ అని చెప్పొచ్చు. ఒక సినిమాను అద్భుతంగా తెరకెక్కించగల డైరెక్టర్లలో మొదటి స్థానంలో ఆయన పేరు ఉండక తప్పదు. ఆయన సినిమాలను తెరకెక్కించే విధానం అద్భుతంగా ఉండటమే దీనికి కారణంగా చెప్పొచ్చు. ఎన్నో అద్భుతాలను తెరకెక్కించిన ఈయన గత కొంత కాలంగా అనుకున్నంత రేంజ్ లో హిట్ కొట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన ‘చెక్క చివంత వానం’ చిత్రం తెలుగులో ‘నవాబ్‌‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సారి యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న మూవీతో వచ్చారు. మరి ఈ సినిమా మణిరత్నం మార్క్ ను దాటిందో? లేదో? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

నటీనటులు: అర‌వింద స్వామి, శింబు, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్, అరుణ్ విజ‌య్‌, జయసుధ, జ్యోతిక‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, అదితిరావ్ హైదరీ
దర్శకత్వం: మణిరత్నం
సంగీతం: ఏ ఆర్ రెహ్మాన్
నిర్మాత: మణిరత్నం, సుభాష్ కరణ్

కథ:

మాఫియా బ్యాక్ గ్రౌండ్ ఉన్న భూపతి(ప్రకాష్ రాజ్) సిటీలోనే గొప్ప పలుకుబడి ఉన్న వ్యక్తి. అతడికి ముగ్గురు కొడుకులు. వాళ్లు వరద(అరవింద స్వామి), త్యాగు(అరుణ్ విజయ్), రుద్ర(శింబు). వరదకి భార్య చిత్ర(జ్యోతిక)తో పాటు ప్రియురాలు(అతిథిరావు హైదరి) కూడా ఉంటుంది. వరదకి పోలీస్ ఆఫీసర్ రసూల్(విజయ్ సేతుపతి) బెస్ట్ ఫ్రెండ్. అతడిని బాగా నమ్ముతాడు. తండ్రికి అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ పనులన్నీ చూసుకుంటూ ఉంటాడు వరద. మిగిలిన ఇద్దరు కొడుకులు విదేశాల్లో సెటిల్ అవుతారు. అయితే ఇంతలో భూపతిపై ఎటాక్ జరుగుతుంది. తనపై మర్డర్ అటెంప్ట్ చేసిందెవరో తెలుసుకున్న భూపతి గుండెపోటుతో మరణిస్తాడు. ఇక తండ్రి మరణం తరువాత ముగ్గురు కొడుకుల మధ్య ఆస్థానం కోసం గొడవలు మొదలవుతాయి. అసలు భూపతిని హత్య చేయాలనుకున్నది ఎవరు..? దానికి గల కారణాలు ఏంటి..? ముగ్గురు అన్నదమ్ముల్లో చివరికి ఎవరు గెలుస్తారు..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

సినిమాలో అందరూ పెద్ద పెద్ద స్టార్సే. అరవింద స్వామి లుక్ పరంగా కొత్తగా కనిపించాడు. శింబు చాలా రోజుల తర్వాత తన నటనతో మెప్పించాడు. ఇక విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటిలాగే అదరగొట్టాడు. అరుణ్ విజయ్ కూడా తన పాత్ర మేర చాలా బాగా నటించాడు. నిజానికి ఈ సినిమాకి ఈ ముగ్గురు అన్నదమ్ముల పాత్రలు ప్రాణం పోశాయి. ఇక ప్రకాశ్ రాజ్, జయసుధ, జ్యోతిక, అదితిరావ్ హైదరీ తమ పాత్రలతో మెప్పించారు. కుటుంబ నేపధ్యంలో సాగే ఆధిపత్య పోరుని తెరపై ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంలో మరోసారి తన ముద్ర వేశాడు మణిరత్నం. ఇక రెహమాన్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. పాటల సంగతేమో కానీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కట్టిపట్టేస్తుంది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్తుంది. మొదటి భాగం బావున్నా.. సెకండ్ హాఫ్ లో సాగతీత లేకుండా ఇంకాస్త ట్రిమ్ చేసినట్టేతే ఇంకా బావుండేది.

ప్లస్ పాయింట్స్:

* నటీ నటులు
* సినిమాటోగ్రఫి
* సంగీతం

మైనస్ పాయింట్స్:

* స్లోగా సాగే కథనం
* సెకండ్ హాఫ్

ఓవరాల్ గా చెప్పాలంటే మణిరత్నం సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చేస్తుంది. ఒకసారి చూడదగ్గ సినిమా అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

 

 

 

నవాబ్ మూవీ రివ్యూ
  • Story
  • Screenplay
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here