మెగాస్టార్ సూపర్ హిట్ టైటిల్ తో చెర్రీ..!

Ram Charan Gets Megastar Superhit Film Title,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Ram Charan Movie Latest Updates,Ram Charan Gets Chiranjeevi Superhit Movie Title,#RC12 Movie Title,Ram Charan Gets Megastar Chiranjeevi Superhit Movie Title,Ram Charan and Boyapati Srinu Movie Title,#RC12 Title Fixed
Ram Charan Gets Megastar Superhit Film Title

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. గత ఇరవై రోజుల నుండి అజర్ బైజాన్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించిన ఈ టీమ్ అక్కడ షూటింగ్ ముగియనుండటంతో ప్యాకప్ చెప్పనున్నారు. ఇక ఇటీవల ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వచ్చాయి. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19న చరణ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. అదేంటంటే…ఈ సినిమా టైటిల్ గురించి. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మెగాస్టార్ సినిమా టైటిల్ ను పెట్టాలని చూస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 1989లో రిలీజైన చిరంజీవి సినిమా స్టేట్ రౌడి. చిరంజీవి, రాధ జంటగా తెరకెక్కిన సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే టైటిల్ ను చెర్రీ మూవీకి పెట్టాలని ఆలోచనలో ఉన్నారట చిత్ర టీం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.

కాగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుంది. బాలీవుడు నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here