మహేష్ బాబు పై తన అభిమానాన్ని చాటుకున్న ఫ్యాన్..

Mahesh Babu Fan Shows his Love for the Star,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Superstar Mahesh Babu Latest News,Mahesh Babu Upcoming Movie News,Mahesh Babu Next Film Updates,Mahesh Babu About Fans
Mahesh Babu Fan Shows his Love for the Star

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఎప్పుడూ ఒకే జోనర్ లో ఉండే సినిమాలు కాకుండా.. ప్రయోగాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. వాటిలో కొన్ని హిట్టవ్వొచ్చు… కొన్ని ఫట్టవ్వొచ్చు. కానీ ప్రయోగాత్మకంగా సినిమాలు చేయడం మాత్రం మానలేదు. అంతేకాదు మహేష్ బాబు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది.. హ్యాండ్సమ్ అని. రోజు రోజుకి ఆయన గ్లామర్ పెరుగుతుందే కానీ… తగ్గినట్టు మాత్రం ఏం కనిపించడంలేదు. ఇక అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటనతో, ఆయన ప్రవర్తనతో ఎంతో మంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబు గురించి ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటారా..? అసలు సంగతేంటంటే..

సాధారణంగా.. హీరోలను అభిమానించే వాళ్లు చాలా మందే ఉంటారు. కానీ…వాళ్లలో డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వారిలో ఓ అభిమాని తన బిడ్డకు మహేష్ పేరు పెట్టుకున్నాడు. అంతేకాదు ఈ విషయాన్ని తాను తన ట్విట్టర్ ఖాతా ద్వారా చెప్పుకొని ఆనందం వ్యక్తం చేశాడు. తన బిడ్డకు మహేష్ బాబు పేరు పెట్టుకున్నాని.. అంతేకాదు దీనికోసం నాలుగు సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నామని ట్వీట్ చేశాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అభిమానులందు ఇలాంటి అభిమానులు వేరయా అన్నట్టు.. ఏదో హీరో అన్న అభిమానమే కాదు… తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావించే ఫ్యాన్స్ ఉండటం నిజంగా హీరోల అదృష్టమనే చెప్పొచ్చు.

కాగా మహేష్ బాబు ప్రస్తుతం.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహర్షి’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాను అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here