ఏ వయసుకు ఆ ముచ్చట అన్నట్లుగా మల్టీల వైపు మొగ్గు చూపుతున్న మన్మధుడు

Akkineni Nagarjuna Being Very Fond of Multi-starrers,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Akkineni Nagarjuna Latest News,Nagarjuna Upcoming Movie News,Nagarjuna Next Film UpdatesNagarjuna game for multi-starrers,Nagarjuna Depends Upon Multi Starrer Movies
Akkineni Nagarjuna Being Very Fond of Multi-starrers

60లో 40 లా కనిపించడం…20 లా ఆలోచించడం నాగార్జున ప్రత్యేకత. కెరీర్ పరంగా గానూ ,వ్యక్తిగతంగా గాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ‘ఫటాఫట్ ధనాధన్ ‘అన్నట్టుగానే ఉంటుంది తప్ప నాన్చుడు అనేది నాగార్జున డిక్షనరీ లో కనిపించదు.

1986 మే 23న ‘విక్రమ్’ సినిమాతో హీరో గా పరిచయమైంది మొదలు నాగార్జున నటన, నడత, నిర్ణయాలు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితాలే. ఇన్నేళ్లపాటు ఎన్నెన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి మెప్పించిన నాగార్జున 60 వ పడిలో పడిన తరువాత కెరీర్ పరంగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పర్సనాలిటీ, గ్లామర్, మైండ్ సెట్ సోలో స్టార్ గా చేయటానికి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తో ఉన్నప్పటికీ ఇక మీదట మల్టీ స్టారర్ చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తానని ప్రకటించారు నాగర్జున.

ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోవలసిన అవసరం లేకపోయినప్పటికీ సోలో చిత్రాల తాలూకు ప్రెజర్ ను ఎవాయిడ్ చేయటానికి మల్టీ స్టారర్ చిత్రాలవైపు మొగ్గు చూపుతున్నారు నాగార్జున.

ప్రస్తుతం హిందీలో రణబీర్ కపూర్ తో కలసి ‘బ్రహ్మాస్త్ర’ అనే మల్టీ స్టారర్ లో చేస్తున్న నాగార్జున తమిళ హీరో ధనుష్ తో కలసి ఆయన స్వీయ దర్శకత్వంలో ఒక పిరియడ్ ఫిలిం చేస్తున్నారు. అలాగే మలయాళంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లా ల్ కాంబినేషన్లో ఒక భారీ మల్టీ స్టారర్ చేయబోతున్నారు. ఇక తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తన పెద్ద కుమారుడు నాగచైతన్యతో నాగార్జున స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అలాగే చి ల సౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 చేయబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇందులో నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకునే కో- స్టార్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. కాగా స్క్రిప్ట్ పరంగా చాలా చాలా టెంప్టింగ్ ఆఫర్ అయితే తప్ప సోలో చిత్రాలకు నాగార్జున ఆల్ మోస్ట్ ఆల్ గుడ్ బై చెప్పినట్లే అనుకుంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

ఈ నిర్ణయం అభిమానులకు అంతగా నచ్చకపోయినా తమ అభిమాన తార నిర్ణయాన్ని గౌరవిస్తున్నారు. ఒక విధంగా ఇది నాగార్జున తీసుకున్న సమయోచిత నిర్ణయం అనే చెప్పాలి. ఇద్దరు కొడుకులు హీరోలుగా ఎదుగుతున్న తరుణంలో తాను ఇంకా సోలో హీరోగా చేయటం కంటే కొన్ని విశిష్ట , విలక్షణ పాత్రలు ఎంపిక చేసుకుని మల్టీ స్టారర్ చిత్రాలు చేస్తే ఏజ్ కి, ఇమేజ్ కి గౌరవప్రదంగా ఉంటుందని ఆలోచించటం నాగార్జున సమయస్ఫూర్తికి అద్దం పడుతుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here