కాశీ కి పోతాను రామా హరి అంటున్న నాని

Actor Nani Wants To Leave To Kashi,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Natural Star Nani Latest News,Nani Upcoming Movie News,Nani Next Film Updates
Actor Nani Wants To Leave To Kashi

ప్రస్తుతం టాలీవుడ్ లో మన టాప్ హీరోలందరూ బిజీబిజీగా ఉన్నప్పటికీ అందరికంటే ఎక్కువగా స్ట్రెస్ లో ఉన్న హీరో నాని అనే చెప్పుకోవాలి. ఒకవైపు దేవదాస్ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంటే ఆ ప్రమోషన్స్ కు అటెండ్ అవుతూ చాలా బిజీగా ఉన్నారు నాని. అది రెగ్యులర్ గా ఏ హీరోకైనా ఉండే ప్రొఫెషనల్ ఒత్తిడి. అయితే ఇదే సమయంలో తాను హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 2 ఆఖరి వారానికి చేరుకోవటంతో నాని ఆ రెండు పనుల్లో తలమునకలై పోయారు. ముఖ్యంగా బిగ్ బాస్ ప్రోగ్రాం తనకు చాలా ప్రెజర్ ఇస్తుందని నాని మాటల్లో అర్థం అవుతుంది. ఆ ప్రోగ్రాం చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో కేవలం కెమెరా ముందుకు వెళ్లి మాట్లాడటమే కాకుండా హౌస్ మేట్స్ మధ్య జరిగిన సంభాషణలు, వాదప్రతివాదనలు, ఘర్షణలు అన్నింటిని ఓపిగ్గా చూసి వాటిమీద తాను ఒక అవగాహన ఏర్పరచుకుని వాటిని క్రోడీకరిస్తూ సంయమనంగా మాట్లాడటం ఒక పెద్ద బాధ్యత.

అలాగే కంక్లూడింగ్ వీక్ కావటంతో బిగ్ బాస్1 హోస్ట్ అయిన ఎన్టీఆర్, దేవదాస్ కో స్టార్ అయిన నాగార్జున ఫైనల్ వీక్ గెస్ట్లుగా వస్తుండటంతో ఆ ప్రోగ్రాం మొత్తాన్ని సమర్థవంతంగా, ఆహ్లాదంగా ప్రజెంట్ చేయవలసిన బాధ్యత నాని మీద ఉంది. అలాగే బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో ఫైనల్ కు చేరే కంటెస్టెంట్ ఎవరు అనేదానిమీద విపరీతమైన అంచనాలు, ప్రజెర్స్ నెలకొన్న తరుణంలో నాని చాలా సమయస్ఫూర్తిగా, సమతుల్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో దేవదాస్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ” ఈ సినిమా రిలీజ్, బిగ్ బాస్ ప్రోగ్రాం అయిపోగానే నేను ఏ కాశీకో పారిపోతాను” అని చమత్కరించారు నాని.

నిజానికి ఇది చమత్కారంగా అన్న మాటే అయినప్పటికీ ఈ ప్రోగ్రాములు పూర్తయ్యాక నాని వెయ్యి టన్నుల బరువును దించేసుకున్న రిలీఫ్ ఫీల్ అవుతారు. ఇక బిగ్ బాస్ షో లో నాని ప్రదర్శన అందరిని ఆకట్టుకోవటం అభినందనీయం. తనకున్న నాచురల్ స్టార్ అనే టైటిల్ కు తగ్గట్టుగానే చాలా నాచురల్ గా కార్యక్రమాన్ని నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు నాని.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here