ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్స్…ఒక్కొక్కరినీ దించేస్తున్నారుగా..!

NTR Biopic Turns Talk of the Industry with Character Looks,Interesting New Entry in NTR Biopic, latest telugu movies 2018, NTR biopic Movie Latest Updates, Purandeswari Character Revealed in NTR Biopic, Purandeswari in NTR Biopic Movie, Purandeswari Look in NTR Biopic Movie, Purandeswari Role in NTR Biopic Telugu Movie, Purandeswari Role Revealed in the Movie NTR Biopic, telugu film updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
NTR Biopic Turns Talk of the Industry with Character Looks

నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈసినిమాలో పలువురు సినీ ప్రముఖులు కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమాను ఎట్టి పరిస్థితిలోనూ విడుదల చేయడానికి షూటింగ్ ను ఫాస్ట్ ఫాస్ట్ గా జరుపుతున్నారు. ఈ లోపు సినిమాలో నటిస్తున్న ఒక్కొక్కరి ఫస్ట్ లుక్ ఫొటోలను విడుదల చేస్తూ అందరిలోనూ క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, రానా, సుమంత్ ఫస్ట్ లుక్ ఫొటోలు విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా బాలకృష్ణలో ఒక ఎన్టీఆర్, రానాలో చంద్రబాబు, ఇక సుమంత్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు…మళ్లీ ఏఎన్నార్ బ్రతికొచ్చారేమో అన్నంతలా పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టే ఉంది. సుమంత్ లుక్ చూసి వెంకటేష్ కూడా నేనే కన్ఫ్యూజ్ అయ్యా అంటేనే అర్ధం చేసుకోవచ్చు..

ఇక ఇప్పుడు మరో లుక్ ను పరిచయం చేశారు చిత్ర టీమ్. ఈ సారి ఎన్టీఆర్ కూతురు పురంధరేశ్వరి లుక్. పురంధరేశ్వరి పాత్రలో హిమాన్షి చౌదరి నటిస్తుంది. అందరి ఫస్ట్ లుక్ ఫొటోస్ లాగే పురంధరేశ్వరి లుక్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. హిమాన్షి చౌదరి కూడా అచ్చం పురంధరేశ్వరి లాగానే ఉంది. ఇద్దరూ పక్క పక్కన నిల్చొని ఉన్న ఈ ఫొటోను చూస్తుంటే నిజంగా ఇద్దరూ ఒకేలా అనిపిస్తున్నారు. నిజంగా ఈ లుక్స్ అన్నీ చూస్తుంటే క్రిష్ ఒక్కో పాత్రను ఎంచుకోవడానికి ఎంత కేరింగ్ తీసుకుంటున్నాడో అర్ధమవుతుంది. ఎవరో ఒకరులే అని కాకుండా…ఎవరి పాత్రకు తగ్గట్టు వాళ్లను ఎంచుకోవడం.. అలా మేకప్ వేయడం..ప్రతి డీటైలింగ్ లో.. చిన్న చిన్న మైన్యూర్ థింగ్స్ కూడా వదిలిపెట్టకుండా అంతలా క్రిష్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కాబట్టే ఇలాంటి రిజల్ట్ వస్తుంది. ఇంకా ఈసినిమాలో పలువురు సినీ తారలు నటిస్తున్నారు. వారి పాత్రలు కూడా అచ్చం అలానే దించేసి ఉంటాడు క్రిష్. మరి ఇక సినిమా చూస్తే వారే తెరపై నటిస్తున్న ఫీలింగ్ వస్తుందేమో మనకి..

కాగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పలువురు సినీ తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ, ఆయన భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటీ విద్యాబాలన్, చంద్రబాబు పాత్రలో రానా, అక్కినేని నాగేశ్వర్రావు పాత్రలో సుమంత్, దగ్గుబాటి వెంకటేశ్వర్రావు పాత్రలో భరత్ రెడ్డి, ఇంకా పలువురు నటిస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణువర్దన్ ఇందూరి నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here