సెప్టెంబర్ మాసంతో చిరంజీవి మెగా అనుబంధం

Chiranjeevi Movie Details, Latest Telugu Movies 2018, Megastar Chiranjeevi Latest News in September, Megastar Chiranjeevi Special Connection with September, Megastar Chiranjeevi Special News in September, Megastar Chiranjeevi Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Megastar Chiranjeevi Special Connection with September

40 ఏళ్ల క్రితం ఇదే రోజున అంటే 1978 సెప్టెంబర్ 22న చిరంజీవి నటించిన తొలి చిత్రం “ప్రాణం ఖరీదు” విడుదలైంది. ఆ తరువాత ఈ నలభై ఏళ్ల ప్రస్థానంలో చిరంజీవికి సెప్టెంబర్ మాసానికి ఏదో తెలియని సెంటిమెంటల్ ఎటాచ్మెంట్ కొనసాగుతూనే ఉంది. ఆ విశేషాలు ఏమిటో చూద్దాం.

👍చిరంజీవి తొలిసారిగా ప్రేక్షకుల ముందు ఆవిష్కృతమైంది సెప్టెంబర్ 22 న.
👍వెండితెరకు పరిచయమైన పదేళ్ల తర్వాత ఆయన నూరవ చిత్రం “త్రినేత్రుడు” సెప్టెంబర్ 22 ,1988 – న విడుదలైంది.
👍హీరోగా పరిచయమైన 22 ఏళ్ల కు చిరంజీవి నటించిన తొలి హిందీ చిత్రం “ప్రతి బంద్” 1990 సెప్టెంబర్ 28 న విడుదలైంది.
👍 ఇదే కోవలో మరికొన్ని విశేషాలు చెప్పుకోవాలంటే……. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన సంచలన విజయం “స్వయంకృషి” విడుదల అయింది సెప్టెంబర్ 3,1987న.
👍అలాగే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి చిత్రం “అడవి దొంగ” విడుదల తేదీ 1985 సెప్టెంబర్ 19.
👍అలాగే విలన్ గా నటించినప్పటికీ చిరంజీవికి గొప్ప గుర్తింపు తెచ్చిన చిత్రం “47 రోజులు” 1981 సెప్టెంబర్ 3 న విడుదలైంది.
👍 తాతయ్య ప్రేమ లీలలు నే సినిమా 1980 సెప్టెంబర్ 19న విడుదల అయింది.
👍ఇక చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశానికి ముందు సంచలన విజయాన్ని సాధించిన “స్టాలిన్” చిత్రం విడుదలైంది సెప్టెంబర్ 6, 2006…
👍 ఇవే కాకుండా సెప్టెంబర్ నెలలో చిరంజీవి కెరీర్ పరంగా మరెన్నో విశేషాలను అభిమానులు రికార్డు చేసే ఉంటారు. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి కే కాదు ఆయన తనయుడు ‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘కు కూడా ఈ సెప్టెంబర్ సెంటిమెంట్ తో మంచి అనుబంధమే ఉంది.
👍తండ్రి చిరంజీవి లాగానే రామ్ చరణ్ కెరీర్ కూడా ప్రారంభమైంది సెప్టెంబర్ లోనే. సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన తొలి చిత్రం “చిరుత” విడుదలైంది 2007 సెప్టెంబర్ ,28న.
👍అలాగే రామ్ చరణ్ నటించిన తొలి హిందీ చిత్రం “జంజీర్” విడుదలైంది సెప్టెంబర్ 6 2013 న. అంటే తండ్రి చిరంజీవి హిందీ హిందీ సినిమా చేయటానికి 22 ఏళ్ళు పడితే తనయుడు రామ్ చరణ్ కేవలం ఆరేళ్లకే నేషనల్ స్క్రీన్ పై పరిచయమయ్యారు.
👍ఇదీ మెగా ఫ్యామిలీతో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తో సెప్టెంబర్ కు ఉన్న అనుబంధం. చిరంజీవి అభిమానులు గాని ఆయన కుటుంబ సభ్యులు గాని ఈ సమాచారానికి మరికొంత సమాచారాన్ని అందించగలిగితే మెగా చరిత్రలో సెప్టెంబర్ వివరాలు, విశేషాలు శాశ్వితంగా రికార్డ్ అవుతాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here