సైరా షూటింగ్.. యుద్దానికి సిద్దమైన జగ్గూభాయ్

Sye Raa Crew is Joined in by the Tollywood Villain,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Sye Raa Narasimha Reddy Cast and Crew,Sye Raa Movie Latest News,Jaggu Bhai Gets Ready for Sye Raa Action Sequences,Jagapathi Babu in Sye Raa Narasimha Reddy Movie,Sye Raa Movie in Tollywood villain,Jagapati Babu Acting in Sye Raa Movie,Sye Raa Movie Movie crew Updates
Jaggu Bhai Gets Ready for Sye Raa Action Sequences

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు జార్జియాలో లో జరుపుకుంటుంది. సినిమాలో అత్యంత కీలకమైన యుద్ద సన్నివేశాలు చిత్రీకరించడానికి అక్కడకు వెళ్లారు. దాదాపు నెలరోజుల పాటు అక్కడే షూటింగ్ జరుపుకోనున్నారు. ఇప్పటికే ఈ యుద్దసన్నివేశానికి సంబంధించి సెట్ ను కూడా సురేందర్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ షూటింగ్ లో ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తున్న జగపతిబాబు కూడా పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి అక్కడ ఉండగా…జగపతి బాబు కూడా అక్కడ షూటింగ్లో పాల్గొనడానికి వెళ్లినట్టు సమాచారం. అంతేకాదు జగపతిబాబు తో పాటు ముకేష్ రిషి కూడా అక్కడికి వెళ్లినట్టు..రేపటి నుండి షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో బాలీవుడు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, విజయసేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here