సామి తెలుగు మూవీ రివ్యూ

Saamy Telugu Movie Review,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Saamy Movie Review,Saamy Movie Review and Rating,Saamy Review,Saamy Telugu Movie Plus Points,Saamy Movie Story,Saamy Movie Public Talk,Saamy Telugu Movie Public Response,Latest Telugu Movie Reviews,Saamy Movie Live Updates
Saamy Telugu Movie Review

2003 లో విక్రమ్, త్రిష హీరో హీరోయిన్లుగా వచ్చిన సామి ఎంత హిట్టయిందో తెలుసు. ఓ రకంగా ఈ సినిమాతోనే విక్రమ్ సినీ కెరీర్ మారిపోయిందని చెప్పోచ్చు. విక్రమ్ సినీ కెరీర్ లో ఓ గొప్ప సినిమాగా నిలిచి పోయిన ఈ సినిమా సీక్వెల్ ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తరువాత తమిళంలో స్కేర్ టైటిల్ తో.. తెలగులో సామి 2 పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి విక్రమ్ కెరీర్ నే మార్చేసిన సినిమా సీక్వెల్ లో వస్తున్న సినిమా మళ్లీ అదే రేంజ్ లో ఉందా..? లేదా..? తెలుసుకోవాలంటే..? సినిమాపై పెట్టుకున్న అంచనాలకు రీచ్ అయిందో..?లేదో..? తెలియాలంటే సినిమా రివ్యూలోకి వెళ్లాల్సిందే.

నటీనటులు: విక్రమ్, కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్,
డైరెక్టర్: హరి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ప్రొడక్షన్: ధామిన్స్ ఫిలింస్

కథ:

రామ్ సామి (విక్రమ్) ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్న పట్టుదలతో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి ఫలితాల కోసం వెయిట్ చేస్తుంటాడు. ఈలోపు సెంట్రల్ మినిస్టర్ అయిన నటుడు ప్రభు దగ్గర ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో తాను ప్రభు కూతురైన కీర్తి సురేష్ తో ప్రేమలో పడతాడు. ఆ తరువాత తాను పరీక్షల్లో ఫస్ట్ గ్రేడ్ లో పాసవ్వడంతో ఐపీఎస్ పదవితో విజయవాడలో పోస్టింగ్ వస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ తన తండ్రి పరుశురామ స్వామి ఐపీఎస్ చావు గురించి..తన తండ్రిని రావణ భిక్షు అనే రౌడి ఎలా చంపించాడో అన్న విషయాల గురించి తెలుసుకుంటాడు. అలా రామ్ సామి తన తండ్రిని చంపిన రావణ భిక్షుపై ఎలా పగ తీర్చుకుంటాడు.. అనేది స్టోరీ

విశ్లేషణ:

ఎప్పటిలాగే విక్రమ్ ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. పవర్ ఫుల్ పోలీసు పాత్రలో.. తన ఫిట్ బాడీ తో ఈ పాత్రలో బాగా నటించాడు. ఇక కీర్తి సురేష్ కూడా బాగానే ఆకట్టుకుంది. విక్రమ్ తో వచ్చే ప్రేమ సన్నివేశాల్లో బాగా నటించింది. కాస్త సంప్రదాయబద్దంగా ఉండే కీర్తి ఈ సినిమాలో గ్లామర్ కు కాస్త ప్రాధాన్యత ఇచ్చినట్టే కనిపిస్తోంది. ఐశ్వర్య తన పాత్ర మేరకు నటించింది. ఇక విలన్ క్యారెక్టర్ చేసిన బాబీ సింహా ఈ పాత్రకు తానే కరెక్ట్ అనేలా చేసి మంచి మార్కులు కొట్టేశాడు. ఇక డైరెక్టర్ తీసుకున్న స్టోరీ లైన్ రొటీనే అయినా.. కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా జోడించారు. సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నప్పటికీ తమిళ్ నుండి ట్రాన్సిలేట్ చెప్పినట్టే అనిపిస్తాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం పర్వాలేదనిపించింది. ముఖ్యంగా తమిళ్ నుండి తెలుగు యాజిటీజ్ గా అనువాదం చేసినట్టున్నారు..అందుకే పాటలు వినడానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్:

విక్రమ్ నటన
యాక్షన్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్:

రొటీన్ స్టోరీ
స్క్రీన్ ప్లే

రివేంజ్ అండ్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కిన ఈసినిమా.. ఓవరాల్ గా మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని చెప్పొచ్చు. సినిమా లవర్స్ కూడా ఒకసారి చూడతగ్గ సినిమా.

 

 

సామి తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • screenplay
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

 

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here