నితిన్-రష్మిక కొత్త సినిమా.. మళ్లీ అదే డైరెక్టర్..

Nithiin and Rashmika pair Up for Chalo Director New Movie,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Chalo Director Upcoming Movie News,Rashmika Mandanna to team up with Nithiin for new film,Rashmika Mandanna Next With Nithiin
Nithiin and Rashmika pair Up for Chalo Director New Movie

ఛలో కాంబో మళ్లీ రిపీట్ అవ్వబోతుంది. ఛలో సినిమాతో హీరోయిన్ గా రష్మిక మందన, డైరెక్టర్ గా వెంకీ కుడుముల తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ సినిమాతో తన లుక్స్ తో, ఎక్స్ ప్రెషన్స్ తో మంచి మార్కులు కొట్టేసిన రష్మిక. తాజాగా వచ్చిన గీతా గోవిందం సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఇక ఛలో సినిమా హిట్ గా నిలవడంతో.. డైరెక్టర్ వెంకీ కి కూడా మంచి పేరొచ్చింది.

ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా నితిన్, రష్మిక మందన కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. భీష్మ అనే టైటిల్ తో సింగిల్ ఫరెవర్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈసినిమా సెట్స్ పైకి వెళుతున్నట్టు తెలుస్తోంది. మరి ప్రస్తుతం అంతగా విజయాలు లేని నితిన్ తో ఛలో కాంబో కలిసొస్తుందేమో చూద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here