యాక్షన్ హీరో అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు అర్జున్. యాక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న ఆయన కేవలం యాక్షన్ సినిమాలే కాదు…పలు విభిన్నమైన పాత్రలు కూడా చేశారు. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో దూసుకుపోయిన అర్జున్ ఆ తరువాత చాలా గ్యాప్ ఇచ్చారు. అయితే మళ్లీ రీసెంట్ గా “నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా”, “అభిమన్యుడు” సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే హీరోగా మళ్లీ కురుక్షేత్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తమిళంలో “నిబునన్” గా విడుదలై మంచి సక్సెస్ సాధించిన ఈ మూవీ తెలుగులో “కురుక్షేత్రం” గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో అర్జున్ 150 మూవీ మైలు రాయిని చేరుకున్నాడు. మరి అరుణ్ వైద్య నాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ కురుక్షేత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే అసలు కథలోకి వెళ్లాల్సిందే.
నటీ నటులు : అర్జున్, ప్రసన్న, వరలక్ష్మి శరత్ కుమార్, సుమన్, సుహాసిని, వైభవ్
కథ,దర్శకత్వం : అరుణ్ వైద్య నాథన్
నిర్మాతలు: ఉమేష్, సుదన్ సుందరం,జయరాం,అరుణ్ వైద్యనాథన్
సినిమాటోగ్రఫీ: అరవింద్ కృష్ణ
సమర్పణ: ప్యాషన్ స్టూడియోస్
సంగీతం: ఎస్. నవీన్
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
స్క్రీన్ ప్లే: ఆనంద్ రాఘవ్ ,అరుణ్ వైద్య నాథన్
కథ:
రంజిత్ కాళిదాసు ( అర్జున్) డిప్యూటీ సుపరిండెంట్ ఆఫ్ పోలీసుగా క్రైమ్ కేసులు చేధించడంలో దిట్ట. ఈ క్రమంలోనే తాను తన టీం సభ్యులు ( ప్రసన్న, వరలక్ష్మీ శరత్ కుమార్ ) తో కలిసి ఓ సిరీస్ గా జరుగుతున్న మర్డర్ కేసును తీసుకుంటాడు. అయితే ఈ మర్డర్ లు చేసే హంతకుడు తాను చేయబోయే ప్రతి మర్డర్ కు సంబంధించి క్లూస్ ను వదిలిపెడుతూ…రంజిత్ టీమ్ కు ఛాలెంజ్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో అసలు ఆ మర్డరర్ ఎవరు..? వరుస హత్యలు చేయడం వెనుక అసలు కారణం ఏంటీ..? రంజిత్ టీం అతన్ని ఎలా పట్టుకుంటుంది..? అసలు స్టోరీ..
విశ్లేషణ:
అర్జున్ అనగానే గుర్తుకు వచ్చేది.. యాక్షన్ కి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. అది దృష్టిలో పెట్టుకొని మరిన్ని యాక్షన్ ఎలిమెంట్స్ యాడ్ చేసి మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు డైరెక్టర్. ఇక ఇలాంటి సినిమాలు అంటే అర్జున్ కు కొట్టిన పిండితో సమానం కాబట్టి.. అర్జున్ ఇప్పటి వరకూ పోలీస్ పాత్రలు చాలా చేసినా.. ఒక భిన్నమైన పోలీస్అధికారిగా ఇందులో తన యాక్షన్ తో మరోసారి మెరిపించాడు. ఇక మళయాళంలో మోహన్ లాల్ వంటి స్టార్స్ ని డైరెక్ట్ చేసిన అరుణ్ వైద్యనాథన్ కురుక్షేత్రం ను అద్యంత ఆసక్తిగా మలిచారు. ఊహించని మలుపులు, ఆసక్తికరమైన కథనాలతో ప్రేక్షకుల ఆలోచనలకు అందని రీతిలో మలిచిన విధానం బావుంది. ఇక ప్రసన్న, వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ప్రధాన పాత్రల్లో బాగా నటించారు. సుమన్, సుహాసిని, వైభవ్, శ్రుతి హారి హారన్ వారి పాత్ర మేరకు బాగానే నటించారు.
ఫ్లస్ పాయింట్స్:
* అర్జున్ నటన
* యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్:
* రొటీన్ స్టోరీ
* సెకండ్ హాఫ్
* కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు
ఓవరాల్ గా యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుంది. అర్జున్ కెరీర్ లో ఇదొక మోస్ట్ మెమరబుల్ సినిమా అవుతుందని చెప్పొచ్చు.
అర్జున్ కురుక్షేత్రం సినిమా రివ్యూ
User Review
( votes)
