హీరో ఫెంటాస్టిక్ ప్రజెంటేషన్ హైలైట్ గా సాగిన “ఈ మాయ పేరేమిటో”

Ee Maya Peremito Movie Live Updates, Ee Maya Peremito Movie Plus points, Ee Maya Peremito Movie Public Response, Ee Maya Peremito Movie Review, Ee Maya Peremito Movie Review And Rating, Ee Maya Peremito Movie Story, Ee Maya Peremito Review, Ee Maya Peremito Telugu Movie Public Talk, Ee Maya Peremito Telugu Movie Review, Latest Telugu Movie Reviews, Latest Telugu Movies 2018, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Ee Maya Peremito Movie Review

టాలీవుడ్ లో ఫైట్ మాస్టర్ గా టాప్ స్టార్స్ చిత్రాలకు పనిచేసి అందరితో సత్సంబంధాలు కలిగిన ఫైట్ మాస్టర్ విజయ్ తన కుమారుడు రాహుల్ విజయ్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ “ఈ మాయ పేరు ఏమిటో” ఈ రోజు విడుదలైంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన కొప్పుల రామును దర్శకుడుగా, తన కుమార్తె దివ్య విజయను నిర్మాతగా పరిచయం చేస్తూ ఎస్.వీ. క్రియేటివ్ వర్క్స్ బేనర్ పై తన సమర్పణలో విజయ్ మాస్టర్ నిర్మించిన” ఈ మాయ పేరేమిటో “ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం.1978 నాటి సంచలన ప్రేమకథాచిత్రం ‘మరోచరిత్ర’ ను గుర్తుచేస్తూ నేచురల్ స్టార్ నాని ఇచ్చే ఓపెనింగ్ కామెంటరీ తో ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది “ఈ మాయ పేరేమిటో “.

కథాoశం :

చందు (రాహుల్ విజయ్)ఒక చలాకీ కుర్రాడు. మంచికి మంచి చెడుకు చెడు అన్నట్లుగా కాలనీలో అందరికీ తలలో నాలుకలా ఉండే చందు చేసే మంచి పనులను చూసి ఇంప్రెస్ అవుతుంది కావ్య( కావ్యాతాపర్). కొద్దిరోజులు తానెవరో తెలియకుండా చందు గురించి కాలనీలో ఎంక్వైరీ చేస్తూ లవ్ ప్రపోజ్ పంపిస్తుంది. తరువాత ఒక సంఘటనలో అనుకోకుండా చందుకు తారసపడుతుంది కావ్య. అప్పటినుండి హాయిగా సాగిపోతుంది వారి లవ్ ఎఫైర్. కావ్య తండ్రి మురళీ శర్మ కు కూతురి ప్రేమ వ్యవహారం తెలిసిపోతుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురుని చేసుకునే అర్హత నీకు ఏముంది అని ప్రశ్నిస్తాడు. చందు దగ్గర సమాధానం లేదు. ఆ సమాధానం లేని ప్రశ్న కు సమాధానం గా నిలుస్తుంది చిత్ర ద్వితీయార్థం.

ఇక్కడ ప్రేమకు అవరోధం కులం కాదు… మతం కాదు…. అర్హత. అర్హత అంటే ప్రయోజకత్వం. చందు ఆ ప్రయోజకత్వాన్ని ఎలా సాధించాడు? ఎలా కావ్యను సొంతం చేసుకోగలిగాడు? ఆ క్రమంలో అతనికి ఎదురైన అనుభవాలు ఏమిటి? సింపుల్ గా ఇదే ఈ “ఈ మాయ పేరేమిటో… చిత్ర కథ. కథగా చెప్పాలంటే గతంలో చాలా సినిమాల్లో చర్చించిన రొటీన్ సబ్జెక్ట్ అయినప్పటికీ సన్నివేశాల అల్లికలో, పాత్రల రూపకల్పనలో, పాత్రల అభినయంలో, హావభావాలలో కొత్తదనం కనిపిస్తుంది. ఇంటర్వెల్ కు ముందు హీరోకు, హీరోయిన్ తండ్రి కి మధ్య జరిగే సంభాషణ చాలా అర్థవంతంగా సాగుతుంది. ప్రేమకు వయసు , అందమే అర్హత. కానీ పెళ్లి చేసుకోవడానికి మరో అర్హత కావాలి… అదేమిటి? హీరో ఆ అర్హతను ఎలా సాధించాడు? అన్నదే మిగిలిన సినిమా.

దర్శకత్వం :

పాయింట్ రొటీన్ అయినప్పటికీ దర్శకుడు రాము కొప్పుల ప్రజెంటేషన్ బాగుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగుంది. తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ప్పటికీ దర్శకుడు రాము కొప్పుల టేకింగ్ లో మంచి పరిణితి కనిపించింది. అయితే ప్రథమార్ధంలో కనిపించిన ఫాస్ట్నెస్ సెకండ్ ఆఫ్ లో అక్కడక్కడ డ్రాప్ అయింది. హీరో ప్రయోజకుడు గా మారే ప్రయత్నం లో హీరోయిన్ ను, ఆమె ప్రేమను నిర్లక్ష్యం చేయటం అనే కాన్సెప్ట్ బాగుంది…. కానీ ఇంకొంచెం ఎఫెక్టివ్ గా చెప్పగలిగితే బాగుండేది అనిపించింది. ఇలాంటి చిన్న చిన్న డ్రాపవుట్స్ మినహాయిస్తే ఒక డెబ్యూ డైరెక్టర్ గా రాము కొప్పుల అభినందనీయమైన డెలివరీ ఇచ్చాడని చెప్పవచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్ :

ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయంలో ఈ మాయ పేరేమిటో కు నూటికి నూరుశాతం మార్కులు వేయవచ్చు. హీరోగా పరిచయమైన రాహుల్ విజయ్ అప్పీరెన్స్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా వెల్డన్ అనిపించాడు. హైట్, అందం, ఎక్స్ప్రెషన్, వాయిస్, ఫైట్స్, డాన్స్ అన్నింటిలోనూ సూపర్ అన్నట్లు ఎనర్జిటిక్ గా సాగింది రాహుల్ విజయ్ ప్రజంటేషన్. అలాగే హీరోయిన్ గా పరిచయమైన కావ్యా తాపర్ కూడా చాలా చాలా బాగుంది…. చాలా బాగా చేసింది. ఇక హీరోయిన్ తండ్రిగా మురళీ శర్మ, హీరో తండ్రిగా రాజేంద్రప్రసాద్, హీరో తల్లిగా ఈశ్వరీరావు నటన చాలా నాచురల్ గా పాత్రోచితంగా ఉంది.

ఇక టెక్నికల్ గా, మేకింగ్ పరంగా ఎలాంటి వంక పెట్టటానికి వీలులేని well presented ఫిలింను అందించిన నూతన మహిళా నిర్మాత ‘దివ్య విజయ్’ ను ప్రత్యేకంగా అభినందించాలి. మణిశర్మ సంగీతంలో రెండు పాటలు ,రీ-రికార్డింగ్ ఈ సినిమాకు హైలెట్ గా చెప్పాలి. శ్యాం .కె .నాయుడు ఛాయాగ్రహణం సింప్లీ సూపర్. కొత్త హీరో హీరోయిన్లను చాలా బ్రైట్ గా, గ్లామరస్ గా ప్రజెంట్ చేయటమే కాకుండా మొత్తం సినిమాను ఒక ఐ ఫీస్ట్ లాగా క్యాన్ చేసిన శ్యాం కె నాయుడు కు ప్రత్యేక అభినందనలు చెప్పాలి. మొత్తానికి చిత్రపరిశ్రమలోని చాలామంది ప్రముఖ సెలబ్రిటీలు అభినందనలు, ఆల్ ద బెస్ట్ లు చెప్పి ఆశీర్వదించిన ఈ మాయ పేరేమిటో వాళ్లందరి బ్లెస్సింగ్స్ ను నిజం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఈ మాయ పేరేమిటో మూవీ రివ్యూ
  • Story
  • Screenplay
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here