సుమంత్ ఏఎన్నార్ లుక్..తాతని మరిపించేలా..!

Sumanth First Look as ANR from NTR Biopic,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Sumanth as ANR in NTR Biopic, Actor Sumanth in NTR Biopic,NTR Biopic Movie Latest Updates,First Look of Sumanth as ANR in NTR Biopic,Sumanth Role in NTR Biopic Telugu Movie,Sumanth Akkineni as ANR in NTR Biopic
Sumanth First Look as ANR from NTR Biopic

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి బాలకృష్ణ ఫస్ట్ లుక్, రానా ఫస్ట్ లుక్, బాలకృష్ణ-రానా కలిసున్న లుక్ విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈరోజు అక్కినేని నాగేశ్వర్రావు జయంతి సందర్భంగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర అయిన అక్కినేని నాగేశ్వర్రావు పాత్రలో నటిస్తున్న సుమంత్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఇక లుక్ చూస్తే సుమంత్ అచ్చం ఏఎన్నార్ లాగానే ఉన్నట్టు అనిపిస్తోంది. నిజానికి అక్కినేని పోలికలు సుమంత్ లో ఎక్కువగా కనిపిస్తాయన్న సంగతి తెలిసిందే. దానికి తోడు…ఆయన గెటప్ కళ్లజోడు.. లాల్చీతో అచ్చం అక్కినేనిలా కనిపిస్తున్నారు. కాగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పలువురు సినీ తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ, ఆయన భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటీ విద్యాబాలన్, చంద్రబాబు పాత్రలో రానా, అక్కినేని నాగేశ్వర్రావు పాత్రలో సుమంత్, దగ్గుబాటి వెంకటేశ్వర్రావు పాత్రలో భరత్ రెడ్డి, ఇంకా పలువురు నటిస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణువర్దన్ ఇందూరి నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here