పెనివిటి పాటపై రామజోగయ్య శాస్త్రి.. సేమ్ స్పాట్ లో మహేష్ పాట

Ramajogayya Sastry connects Peniviti song with Mahesh Babu hit song,Telugu Filmnagar,Latest Telugu Movie News,Tollywood Movie Updates, Aravindha Sametha Songs,Aravindha Sametha Movie Songs,Aravindha Sametha Telugu Movie Songs,Ramajogayya Sastry About Aravindha Sametha Songs
Ramajogayya Sastry connects Peniviti song with Mahesh Babu hit song

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జోడీగా ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రయూనిట్ గ్యాప్ లేకుండా మరీ షూటింగ్ చేసుకుంది. ఒక పక్క సాంగ్స్ రిలీజ్ చేస్తూనే..మరోపక్క మిగిలిన పనులు పూర్తి చేసే పనిలో పడ్డారు త్రివిక్రమ్. ఇప్పటికే ఈ సినిమా నుండి అనగనగనగా లిరికల్ పాటను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం రెండో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. పెనివిటి అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేయగా..ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

“నిద్దరినీ ఇరిచేసి రెప్పల్ని తెరిసాను .. నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను .. ఓటెద్దు బండెక్కి రారా .. సగిలేటి డొంకల్లో పదిలంగా రారా ..” అంటూ ఈ పాట సాగుతోంది. థమన్ సంగీతం, రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం, కాల భైరవ గొంతు ఇవన్నీ కలిసి పాటను మనసును హత్తుకునేలా చేశాయి. రాయలసీమ యాసలో వాడుక పదాలను ఉపయోగిస్తూ రామజోగయ్య శాస్త్రి ఈ పాటను అద్భుతంగా రాశారు. ఇంతవరకూ ఆయన చేసిన మనసు పాటల్లో ఇది ఒకటిగా చేరుతుందని చెప్పొచ్చు.

ఇక ఈపాట రాసిన రామజోగయ్య శాస్త్రి ఈ పాట రిలీజ్ నేపథ్యంలో కొన్ని ఆసక్తివిషయాలు తెలిపారు. ఈ పాటను నేను బొంబాయ్ బీచ్ దగ్గర వినాలనుకుంటున్నాను… చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరీ రెడీగా ఉన్నాను ఎప్పుడు విందామా అని..ఎందుకంటే భరత్ అనే నేను సినిమాలో ముసిలి తాత అనే పాట లైన్స్ ఇక్కడే రాశాను…దేవి శ్రీ ఇచ్చిన సంగీతంతో ఆపాట ఎంత హిట్ అయిందో తెలుసు కదా అని తెలిపారు. మరి నిజంగానే భరత్ అనే నేను సినిమాలో ఆ పాటకు ఎంత క్రేజ్ వచ్చిందో..ఇప్పుడు ఈ పాట కూడా అరవింద సమేత సినిమాలో..అంతేకాక ఎన్టీఆర్ సినిమాల్లో బెస్ట్ సాంగ్ అవుతుందని చెప్పొచ్చు. కాగా ఈసినిమా జ్యూక్ బాక్స్ ను ఈరోజు రిలీజ్ చేశారు. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here