మంచువారింట విషాదం.. మోహన్ బాబు తల్లి లక్ష్మమ్మ మృతి..

Manchu Lakshmamma Mother of Mohan Babu No More,Manchu Lakshmamma is No More,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Mohan Babu Mother Manchu Lakshmamma is No More,Manchu Lakshmammai RIP News,Manchu Lakshmamma Passes Away,Manchu Family Latest News
Manchu Lakshmamma is No More

నటుడు మోహన్ బాబు ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మోహన్ బాబు తల్లి మంచు లక్ష్మమ్మ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం లక్ష్మమ్మ భౌతికకాయాన్ని తిరుపతి నుంచి ఎ.రంగంపేట సమీపంలోగల మోహన్ బాబు విద్యాసంస్థలు విద్యానికేతన్ ప్రాంగణంలోని ఆమె నివాసానికి తరలించారు. రేపు తిరుపతిలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మరోవైపు మంచు లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి తిరుపతికి బయల్దేరారు. మోహన్‌ బాబు, ఆయన కుటుంబసభ్యులు ప్రస్తుతం విదేశాల్లో ఉండటంతో…హుటాహుటిన స్వదేశానికి బయలుదేరారు. ఇదిలా ఉండగా మనవడు మంచు మనోజ్ కూడా ఈ వార్త పై స్పందించి.. ‘ మా నానమ్మ లక్ష్మమ్మ దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు. మిమ్మల్ని మిస్సవుతాం నానమ్మ. ఈ సమయంలో నేను భారతదేశంలో లేకపోవడం బాధకలిగిస్తోంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను..అని తన ట్విట్టర్ ద్వాారా బాధను తెలియజేశారు. కాగా లక్ష్మమ్మ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించి సంతాపం తెలియజేస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here