ప్రపంచ చలనచిత్ర రంగంలో సమకాలికులు,సమఉజ్జీలు ,సమస్థాయి కలిగిన ఇద్దరు మహానటులు 14 చిత్రాలలో కలిసి నటించటం ఒక అరుదైన రికార్డ్. ఆ ఘనతను సాధించి “మల్టీస్టారర్” అనే కాన్సెప్ట్ కు ఆనాడే సరికొత్త నిర్వచనం చెప్పారు మన నటరత్న ఎన్. టి. ఆర్.- నటసామ్రాట్ ఏ.ఎన్. ఆర్.లు. వ్యక్తిగతంగా వీరిద్దరి నటజీవితాలు ఎంత ఆదర్శప్రాయమైనవో సహనటులుగా కూడా అంతే ఆదర్శప్రాయులు ఈ అగ్ర నటులు. ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించటానికి కాంబినేషన్ సెట్ చేయలేక దర్శకనిర్మాతలు తల్లకిందులవుతున్నారు నేటి నిర్మాతలు.అలాంటిది తెలుగు చిత్రపరిశ్రమకు రెండు కళ్ళుగా భాసించిన ఆ మహానటులు 14 సినిమాల్లో కలిసి నటించారన్నది మన భావి తరాలకు నమ్మశక్యం కానీ ఓ అద్భుతంగా అనిపించవచ్చు… వారిద్దరి కాంబినేషన్లో పల్లెటూరిపిల్ల,సంసారం,రేచుక్క,చరణదాసి,, పరివర్తన,తెనాలి రామకృష్ణ,మిస్సమ్మ,మాయాబజార్, భూకైలాస్,గుండమ్మ కథ,కృష్ణార్జునయుద్దం,చాణుక్య శపథం ,రామకృష్ణులు,సత్యం-శివం చిత్రాలు వచ్చాయి.
ఇప్పడు ఆ మహానటులు ఇరువురూ మన మధ్యన లేకపోయినప్పటికీ వారు కలిసి నటించిన 14 చిత్రాల విజయవిశేష వార్తలు,వారి ఆదర్శప్రాయమైన స్నేహానుబంద ప్రయాణం మనకు ఎప్పటికీ గుర్తుండి పోతాయి.కాగా ఆ ఇరువురిలో ఒకరైన అక్కినేని నాగేశ్వర రావు 95 వ జయంతి ఈ రోజు… ఈ సందర్బంగా ఆ ఇరువురి కాంబినేషన్లో వచ్చిన 14 మల్టీస్టారర్ చిత్రాల నుండి 10 చిత్రాలను పేర్కొంటూ what is the Best among the ten of NTR-ANR combination అనే పోల్ గేమ్ నిర్వహిస్తుంది మీ “తెలుగు ఫిల్మ్ నగర్ డాట్ కామ్.ఆ మహానటుల జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వారి కాంబో చిత్రాల విశేషాలను గుర్తుచేసుకుంటూ ఈ నాస్టోలాజికల్ పోల్ గేమ్ లో పాల్గొనవలసిందిగా మిమ్ములను ఆహ్వానిస్తుంది మీ TFN.. So… vote to The Best of the Great combo.
