కవలలకు జన్మనిచ్చిన మహేష్ బాబు హీరోయిన్

Mahesh Babu Heroine Gives Birth to Twins,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Takkari Donga Heroine Lisa Ray Gives Birth to Twins,Mahesh Babu Movie Latest News,Superstar Mahesh Babu Movie Takkari Donga Latest Updates,Takkari Donga Movie Heroine Gives Birth to Twins
Mahesh Babu Heroine Gives Birth to Twins

మహేష్ బాబు హీరోయిన్ ఇద్దరు కవల పిల్లలకి జన్మనిచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు మహేష్ బాబు టక్కరి దొంగ సినిమాలో ఒక హీరోయిన్ అయిన లీసా రే. మోడల్, హీరోయిన్ అయిన లీసా రే జార్జియాలో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. అసలు లీసారే ఎప్పుడు గర్భం దాల్చింది.. ఎప్పుడు పిల్లలు పుట్టారబ్బా అనుకుంటున్నారా..? మాములుగా కాదులెండీ.. సరోగసీ పద్దతి ద్వారా ఇద్దరు ఆడ కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్.. ఇన్ స్టాగ్రామ్ ద్వారా సంతోషంగా అందరితో పంచుకున్నారు.

తన వైవాహిక జీవితం ఎన్నో సంతోషాలతో కొనసాగుతోందని.. తన కూతుళ్ల రాకతో అది పరిపూర్ణమైందని భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో ఏదీ ప్రణాళిక ప్రకారం జరగలేదని.. అయితే తన భర్త కూతుళ్ల రూపంలో తనకు గొప్ప సర్‌ప్రైజ్‌ ఇచ్చారంటూ ఆనందం వ్యక్తం చేశారు. కాగా గతంలో లీసా రే క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే కదా. క్యాన్సర్‌ నుంచి కోలుకున్న రెండేళ్ల తర్వాత తన చిరకాల మిత్రుడు జాసన్‌ డేహ్నిని పెళ్లాడారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here