ఆల్ రౌండర్ ఉపేంద్ర పుట్టిన రోజు…ఆసక్తికర విషయాలు!

Actor Upendra birthday Latest Updates, Amazing Facts About Birthday Boy Upendra, Interesting Facts About Birthday Boy Upendra, Latest Telugu Movies 2018, Telugu Actor Upendra Turns 51st Birthday Today, Telugu Celebs Birthday News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News, Upendra Birthday Celebrations, Upendra Birthday Special News
Amazing Facts About Birthday Boy Upendra

దర్శకుడు, బహుబాష నటుడు..కథా రచయిత, పాటల రచయిత, సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు.. ఇలా అన్ని విభాగాల్లో తన ప్రతిభను చాటి ఆల్ రౌండర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరనుకుంటున్నారా..ఎవరో కాదు ఉపేంద్ర. ఈరోజు ఉపేంద్ర పుట్టినరోజు కావడంతో ఆయన గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

ఒక్క కన్నడ చిత్రపరిశ్రమలోనే కాకుండా ఇతర బాషల్లోనూ నటించి తన కంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు విలక్షణ నటుడు ఉపేంద్ర. నటుడిగానే కాదు..దర్శకుడిగాను కూడా ఆయన మెగా ఫోన్ పట్టి అందరినీ మెప్పించాడు. తెలుగులో కూడా తనదైన శైలిలో..సహజంగా నటిస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన ఎంచుకునే కథలు, యాక్టింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే అతడ్ని మిగతా హీరోల కంటే భిన్నంగా చూపించింది. బోల్డ్ టైపు మూవీస్ అప్పుడే చేసి ట్రెండ్ సెట్ చేశారు. అతడు నటించి, దర్శకత్వం వహించిన ఓం, ఎ, స్వస్తిక్, ఉపేంద్ర, రా లాంటి సినిమాలు కేవలం బోల్డ్ మూవీస్ మాత్రమే కాదు.. అప్పట్లో పాథ్ బ్రేకర్స్ గా కూడా నిలిచాయి.

1989లో చిన్న రోల్ తో అతిథి పాత్ర చేసిన ఉపేంద్ర, ప్రస్తుతం కన్నడనాట బిగ్ స్టార్స్ లో ఒకరు. రాజశేఖర్ హీరోగా రూపొందిన ‘ఓంకారం’ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ తెలుగునాట అడుగుపెట్టాడు ఉపేంద్ర. ఆ తరువాత “కన్యాదానం, రా, ఒకే మాట” వంటి తెలుగు చిత్రాల్లో హీరోగానూ నటించాడు. ఇప్పటికీ అడపాదడపా ఒకటీరెండూ తెలుగు చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. ఆ మధ్య అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో కీలక పాత్ర పోషించాడు ఉపేంద్ర. తన కెరీర్ లో లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నారు.

పొలిటికల్ ఎంట్రీ

తాను దర్శకత్వం వహించిన చిత్రాల్లో నేటి రాజకీయాలపై, జనం తీరుపై పలు వ్యంగ్యాస్త్రాలు సంధించి ఆకట్టుకునే వాడు. ఇప్పుడు ఏకంగా ఉపేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. గత ఏడాది ఆగస్టు 12న ‘ఉత్తమ ప్రజాపార్టీ’ అన్నసొంత రాజకీయ పార్టీని నెలకొల్పాడు ఉపేంద్ర. మరి రాజకీయాల్లో కూడా తన మార్కు చూపించాలని.. ప్రజలకు సేవ చేయాలని..మరి నేటితో 51 ఏళ్లు పూర్తిచేసుకున్న ఉపేంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని మంచి పాత్రలు పోషించాలని కోరుకుంటుంది తెలుగుఫిలింనగర్.కామ్

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here