నమ్రతా ప్లాన్… మహేష్ బ్యానర్ పై వెబ్ సిరీస్

Latest Telugu Movies News, Mahesh Babu Ventures Into Web Series Production, Namrata Plans Web Series Under MB Productions Banner, Superstar Mahesh Babu Ventures Into Web Series Production, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates
Namrata Plans Web Series Under MB Productions Banner

ఒకప్పుడు ఏదైనా ఒక కొత్త సినిమాను టీవీల్లో చూడాలంటే ఒక సంవత్సరం తరువాతో..రెండు సంవత్సరాల తరువాతో వేసేవాళ్లు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని…సంవత్సరం కాదు కదా..అలా థియేటర్లలో రావడమే ఆలస్యం..ఆ తరువాత ఓ నెలకో..రెండు నెలలకో..టీవీల్లోనో…నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి యాప్స్ ల్లోనో దర్శనమిస్తున్నాయి. ఎంచక్కా చూసేస్తున్నారు జనాలు కూడా. ఒక్క సినిమాలే కాదు…ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా..పాపులర్ అవ్వాలన్నా.. షార్ట్ ఫిలింస్, వెబ్ సీరిస్ లు ఒక్కటని కాదు… ఇప్పుడు అన్ని విషయాలకు డిజిటల్ మీడియానే వేదికగా మారింది. మరి అంతలా జనాలు అలవాటు పడ్డ డిజిటల్ మీడియాను క్యాష్ చేసుకునే వాళ్లు కూడా ఉంటారు కదా. అందుకే ఈ మధ్య సెలబ్రిటీలు కూడా వెబ్ సిరీస్ లు తీయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటారా…? అసలు సంగతేంటంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఇప్పుడు వెబ్ సిరీస్ లు చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి మహేష్ బాబు వ్యవహారాలన్నింటినీ దాదాపు నమ్రతనే చూసుకుంటారు. అంతేకాదు బిజినెస్ పరంగా కూడా ఆమెకు చాలా నాలెడ్జ్ ఉంది. అందులో భాగంగానే మహేష్ బాబు స్వంత బ్యానర్ జిఎమ్బీ కూడా స్టార్ట్ అయింది. ఈ బ్యానర్ లో ప్రస్తుతం సినిమాలు తీస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే బ్యానర్ మీద వెబ్ సిరీస్ లు చేయడానికి నమ్రత రెడీ అయినట్లు తెలుస్తోంది. జియో సంస్థ కోసం ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, మరిన్ని వెబ్ సిరిస్ లు, మినీ మూవీస్ లాంటివి చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారట. టాలెంట్ వున్న కొత్త డైరక్టర్లు కానీ, ఒకటి రెండు సినిమాలు చేసినవారు కానీ, మంచి స్క్రీప్ట్ తో వస్తే వారితో చేసేందుకు నమ్రతా సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి నమ్రతా ఈ ప్రయత్నం వల్ల కొత్త టాలెంట్ కు ఛాన్స్ ఇచ్చినట్టే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here