రజినీ కాంత్ ఫ్యాన్స్ కు బంపరాఫర్.. 2.0 టీజర్ ఫ్రీ గా చూసే అవకాశం..

2Point0 Teaser for Free For Rajinikanth Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,2.0 Movie Updates,2.0 Telugu Movie Latest News,Rajinikanth 2.0 Movie Latest Update,2Point0 Teaser Latest News,2Point0 Teaser for Free For Superstar Rajinikanth Fans
2Point0 Teaser for Free For Rajinikanth Fans

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రోబో సీక్వెల్ 2.0 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రోబో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పుడే ఓ విజువల్ వండర్ చూపించారు శంకర్. దీంతో ఇప్పుడు వస్తున్న 2.0 పై ఇంకేం మ్యాజిక్ చూపిస్తారా అని అటు శంకర్ అభిమానులు..ఇటు రజినీ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ అయితే దర్శనమిస్తున్నాయి కానీ కనీసం టీజర్ కూడా విడుదల చేయకపోవడంతో ఆశగా చూస్తున్నారు.

ఇప్పుడు ఆ టైం రానే వచ్చింది. వినాయక చవితి సందర్భంగా 2.0 టీజర్ ను విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. సెప్టెంబర్ 13 అంటే రేపే ఈ సినిమా టీజర్ ను 3డి – 2డి వెర్షన్ లలో రిలీజ్ చేయనున్నారు. దీంతో అభిమానుల ఎప్పుడెప్పుడు టీజర్ చూద్దామా అని చూస్తున్న వేళ మరో బంపరాఫర్ ప్రకటించారు. ఈ టీజర్ ను ఫ్రీగా చూసే అవకాశం కల్పించారు. అదెలాగంటారా…? ఏం లేదు జస్ట్ మిస్ కాల్ ఇస్తే సరిపోతుంది. పీవీఆర్‌, సత్యం థియేటర్స్‌లో 3డీ టీజ‌ర్‌ని ఉచితంగా చూడవచ్చని..అయితే ఇందుకోసం 90999 49466 అనే నెంబ‌ర్‌కు మిస్డ్‌కాల్‌ ఇచ్చి టికెట్‌ను బుక్‌ చేసుకోవాలని శంక‌ర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. మరి అభిమానులకు ఇది గుడ్ న్యూసే. ఇంకెందకు ఆలస్యం జస్ట్ ఒక్క మిస్ కాల్ ఇవ్వండి..టీజర్ ఫ్రీగా చూసేయండి.

కాగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్‌, అమీ జాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌్లో నటిస్తున్నారు. దాదాపు 540 కోట్లతో..రోబో చిత్రాన్ని మించి.. హాలీవుడ్ స్థాయికి తగ్గని రీతిలో లైకా సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. అన్ని పనలు త్వరగా పూర్తిచేసి నవంబ‌ర్ 29న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి శంకర్ ఈ సినిమా ద్వారా ఒక విజువల్ వండర్ని క్రియేట్ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here