సైరా సినిమా షూటింగ్ విదేశాలలో

Sye Raa Shoot in Foreign Locations,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Sye Raa Shoot Updates,Sye Raa Movie Shooting Schedule in Foreign Locations,Sye Raa Telugu Movie Shooting Latest News,Chiranjeevi Movie Sye Raa Shooting in Abroads,Sye Raa Movie Team Shoot in Foreign
Sye Raa Shoot in Foreign Locations

స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మెగా స్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్,విజయ్ సేతుపతి, సుదీప్,నయనతార,తమన్నా వంటి ప్రముఖ తారాగణం తో భారీబడ్జెట్ తో కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైరా సినిమాను నిర్మిస్తున్నారు.

సైరా సినిమా హైదరాబాద్ లో నిర్మించిన ప్రత్యేక సెట్స్ లో షూటింగ్ జరుపుకుంది. ఇప్పుడు సైరా సినిమా షూటింగ్ యూరోప్ లోని జార్జియా దేశంలో జరుపుకోనుంది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి, వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాలు జార్జియాలోని పలు లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్నాయి. డైరెక్టర్ క్రిష్ టీమ్ ఎంపిక చేసిన లొకేషన్స్ లో ఆ సినిమాల వార్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. ఆ లొకేషన్స్ లోనే 20 రోజులపాటు సైరా సినిమా షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ షూటింగ్ షెడ్యూల్ లో నరసింహారెడ్డి కి బ్రిటిష్ సైనికులకు మధ్య పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సైరా నరసింహా రెడ్డి సినిమా పై ప్రేక్షకులకు,మెగా అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here