ఆ విషయంలో సైరా నన్ను చాలా మార్చేసింది

Sye Raa Changed Me Completely Surender Reddy,Sye Raa A Life Altering Experience Says,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018, Surender Reddy, Director Surender Reddy Life Altering Experience From Sye raa Movie, A Life Altering Experience to Surender, Reddy,Sye Raa Movie Director Surender Reddy Latest News,Sye Raa Movie changed Surender Reddy life,Sye Raa Movie About Surender Reddy,Sye Raa A Life Altering Experience Says
Sye Raa changed me completely - Surender Reddy

అతనొక్కడే సినిమాతో డైరెక్టర్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన సురేందర్ రెడ్డి జయాపజయాలతో పనిలేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఆయన ఏ సినిమా చూసినా మేకింగ్ మాత్రం చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ సినిమాల్లో కొన్ని ఫ్లాపులు ఉండొచ్చు కానీ దర్శకుడిగా మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు సురేందర్ రెడ్డి. ఆ నమ్మకంతోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సైరా సినిమా బాధ్యతలను మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి చేతిలో పెట్టారు. ఇక సురేందర్ రెడ్డి కూడా చాలా జాగ్రత్తగా.. ప్రతి ఒక్క చిన్న విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాను తీసే పనిలో పడ్డాడు. బేసిక్‌గానే సురేందర్ రెడ్డికి కింగ్ ఆఫ్ మేకింగ్ అనే పేరుంది.ఇప్పుడు సైరాతో మరోసారి అది నిరూపించుకునే పనిలో ఉన్నాడు.

ఇదిలా ఉండగా తాజాగా ఆయన సైరా సినిమాతో ఉన్న అనుబంధాన్ని తెలిపాడు. నేను చిన్నప్పటినుండి చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ అని… ఆ ప్యాషన్ తోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టాను…నాకు అవకాశాలు ఇచ్చిన హీరోలందరికి కృతజ్ఞతలు అని తెలిపాడు. చిరంజీవి గారికి డైరెక్షన్ చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు.. నా కల నెరవేరింది అని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. సైరా ఒక మనిషిగా నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది నా అలవాట్లు, అభిరుచులు, ఇష్టాయిష్టాలు అన్నిటిలో మార్పు వచ్చిందని తెలిపారు. ఇంకా చిరంజీవి గారి గురించి చెబుతూ ఆయనపై ప్రశంసలు కురింపిచారు. అతని వ్యక్తిత్వం ఎంతైనా చదవాలనిపించే ఒక పుస్తకం లాంటిది..ఆయనతో జర్నీ ఆపాలనిపించదు.. అని తన అనుభూతులను పంచుకున్నారు. మొత్తానికి సైరాతో మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు సురేందర్ రెడ్డి. సైరాతో తన సత్తా మరోసారి చూపించడానికి రెడీ అవుతున్నాడు. మరి చూడటానికి మనం కూడా రెడీగా ఉందాం..

కాగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ మూవీని రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. నయనతార చిరంజీవితో జోడీ కడుతున్నారు. ఇంకా ఈసినిమాలో అమితాబ్, జగపతి బాబు, విజయసేతుపతి, కిచ్చా సుదీప్, తమన్నా ఇలా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here