అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి లాగా 8 నెలలు మేకప్ కు దూరమైన బన్నీ

Allu Arjun Faces Chiranjeevi Situation,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Stylish Star Allu Arjun Latest News,Allu Arjun Follows Chiranjeevi Faces Situation,Hero Allu Arjun Updates,Stylish Star Follows Chiranjeevi
Allu Arjun Faces Chiranjeevi Situation

సాధారణంగా ఒక సినిమా రెడీ ఫర్ రిలీజ్,ఒకటి ఆన్ సెట్స్,ఇంకొకటి ప్రి ప్రొడక్షన్ దశ లో ఉండటం ఏ స్టార్ కైనా రివాజు .కానీ ఈ తరం స్టార్స్ చాలామంది ఈ షెడ్యూల్ ను ఫాలో అవ్వలేకపోతున్నారు .ఒక సినిమా రిలీజ్ అయి హిట్ అయితే ఆ హ్యాంగోవర్ లో ఎంజాయ్ చేయటం అది కాస్తా ఫట్ అయితే వాట్ నెక్స్ట్ అని వెతుక్కోవటం….అయితే అందరూ ఇలాంటి నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారని చెప్పలేము. అసలు ఇలాంటి స్థితికి ముందుచూపు లేకపోవడమే కారణం అంటారు కానీ కథల కొరతే అసలు కారణం… ప్రధాన కారణం.

నిజానికి ప్రొఫెషనల్ స్టార్స్ ఎవరూ కావాలని ఖాళీగా కూర్చోరు. కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్స్ ఖాళీగా ,అన్ ఎంప్లాయిడ్ గా ఉంటే అది వ్యక్తిగతంగా తనకు,వ్యవస్థాపరంగా ఇండస్ట్రీ కి తీవ్ర నష్టం.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే “స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్” ముఖానికి రంగేసుకొని 6 నెలలు దాటిపోయింది. దీనికి కారణం అల్లుఅర్జున్ కు ప్లానింగ్ లేకపోవటం అని ఎవరూ అనలేరు.ఎందుకంటే అల్లుఅర్జున్ కు సినిమా అంటే ఎంత పిచ్చో,ఎంత ప్రేమో,ఎంత గౌరవమో అందరికీ తెలుసు.ఆక్షేపణకు అవకాశమే లేని ఒక గొప్ప ఫిల్మ్ ప్రొఫెషనల్ అల్లు అర్జున్. అలాంటి అల్లుఅర్జున్ కు 6 నెలలకు పైగా మేకప్ వేసుకోలేని పరిస్థితి ఎందుకొచ్చింది.?దానికి కారణం ఒకటే…. ఈ సరైనోడికి సరైన సబ్జెక్టు దొరక్కపోవటమే.

నిజానికి తనకు ఉన్న క్రేజ్ కు,డిమాండ్ కు ఏదో ఒక ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కించి సొమ్ము చేసుకోవచ్చు. కానీ అలాంటి హాఫ్ హార్టెడ్ ప్రాజెక్ట్ లు చేసి నెంబర్ ను,బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచుకునే ఆలోచనే ఉంటే ఈ నిరుద్యోగ స్థితి ఎందుకొస్తుంది ?
నిజానికి ఇప్పటి బన్నీ పరిస్థితి చూస్తే ఒకప్పటి మెగాస్టార్ చిరంజీవి పరిస్థితి గుర్తుకు వస్తుంది. ఆయన కూడా ఒకసారి ఇలాగే 8 నెలల పాటూ ముఖానికి రంగేసుకోకుండా ఖాళీగా ఉండిపోవలసి వచ్చింది. అప్పట్లో చిరంజీవి లాంటి ఒక హైలీ పెయిడ్ మెగాస్టార్ 8 నెలలు పని లేకుండా ఖాళీగా ఉండటం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశం అయింది.ఒక వైపు దర్శకులు స్క్రిప్ట్ లతో ,నిర్మాతలు చెక్కులతో ప్రదక్షిణలు చేస్తుంటే ఏ సబ్జెక్టు చేయాలో, ఏ జోనర్ ఎన్నుకోవాలో తెలియని సందిగ్దత స్థితిలో పడిపోయారు చిరంజీవి. “ఘరానామొగుడు ” లాంటి స్టుపెన్డస్ హిట్ తరువాత ఏ సినిమా చేసినా అది మెగాస్టార్ ఇమేజ్ ముందు దిగదుడుపుగా అనిపించేది .నిజానికి ఘరానామొగుడు తరువాత కొన్ని మంచి సినిమాలు కూడా ఆ వేవ్ లో నిలబడలేదు.

ఆపద్బాంధవుడు, ముట్ఠామేస్త్రి,మెకానిక్ అల్లుడు, ముగ్గురు మొనగాళ్ళు , ఎస్.పీ. పరశురాం,అల్లుడా మజాకా,బిగ్ బాస్ రిక్షావోడు వంటి చిత్రాలలో కొన్ని బాగానే ఉన్నప్పటికీ అవి చిరంజీవి అనే “మ్యాటనీ ఐడాల్ ” మీద ఉన్న అంచనాలను అందుకోవటంలో ఫెయిల్ అయ్యాయి.అలాంటి స్థితిలో తన ఏం చెయ్యాలో ,ఎలా ముందడుగు వేయాలో తెలియని సందిగ్ధంలో 8 నెలలపాటు మేకప్ కు దూరంగా తనను తాను నిర్బంధిచుకొని,నియంత్రించుకొని అప్పుడు ” హిట్లర్ ” రీమేక్ తో పునః విజృంభించారు చిరంజీవి.

‌ ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా అలాంటి “What to do and what not to do ..అనే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఈ స్టైలిష్ స్టార్ విక్రమ్ కుమార్ డైరెక్షన్లో సినిమా ఓ కే చేశారనీ,క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఒక హిందీ సినిమా కూడా చేస్తున్నారనే అనధికార వార్తలు వినిపిస్తున్నాయి. అవి కార్యరూపం దాల్చి మరలా బన్నీ ముఖానికి ప్యాన్ కేక్ తాకటానికి మరో రెండు నెలలు పడుతుంది . అంటే మెగాస్టార్ లాగానే బన్నీకి కూడా 8 నెలల విరామం పూర్తవుతుంది. ఈ 8 నెలల సినీ వియోగం బన్నీ కి ఒక సెల్ఫ్ రెజువనైజేషన్ అనుకోవాలి .ఆ తరువాత తన “మెంటార్ మెగాస్టార్ చిరంజీవి” హిట్లర్ తో మరలా ఎలా సిక్సర్ కొట్టారో ఆ స్థాయి కంబ్యాక్ తో విజృంభించి ఈ “సరైనోడు” లెఖ్హలు సరిచేస్తాడని ఆశిద్దాం .

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here