లాజిక్కుల గురించి ఆలోచించకపోతే ‘సిల్లీ ఫెలోస్ ‘ మంచి టైం పాస్ యంటర్టైనర్

Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Silly Fellows Movie Live Updates, Silly Fellows Movie Public Talk, Silly Fellows Movie Review, Silly Fellows Movie Review & Rating, silly fellows review, Silly Fellows Telugu Movie Plus Points, Silly Fellows Telugu Movie Public Response, Silly Fellows Telugu Movie Review, Silly Fellows Telugu Movie Story, Telugu Film News 2018, Telugu Filmnagar
Silly Fellows Movie Review

‘కామిడీ సినిమాకెళ్లి లాజిక్కులు వెతుకుతాడు వీడేవడండీ బాబు’ అనుకునేంత విశాల హృదయం మీకుంటే “సిల్లీ ఫెలోస్” లాంటి సినిమాలను మంచి టైం పాస్ బఠానీళ్ల లాగా ఎంజాయ్ చేయవచ్చు . నవ్వించటానికి ప్రయత్నిచటమే ఒక సాహసం కాబట్టి ఆ ప్రయత్నంలో కొన్ని తప్పులు దొర్లినా చూసీచూడకుండా చూసి ఎంజాయ్ చేసినవాడే నిజమైన హాస్యప్రియుడు.ఈ కోణంలో ఆలోచిస్తే అల్లరి నరేష్,సునీల్ కలిసి మిమ్మల్ని పగలబడ నవ్వించకపోయినా మీ రెండున్నర గంటల టైమ్ పాస్ కోసం సీరియస్ గా కష్టపడ్డారు అనిపిస్తుంది “సిల్లీ ఫెలోస్” చూస్తే. కెరీర్ పరంగా ఆ ఇద్దరికీ ఒక గట్టి హిట్ పడితే తప్ప గట్టెక్కని గడ్డు పరిస్థితి నెలకొన్న తరుణంలో దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు వాళ్ళను ఎంతవరకు గట్టెక్కించాడో సిల్లీ ఫెలోస్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

వీరబాబు (అల్లరి నరేష్),సూరిబాబు(సునీల్) మంచి అవకాశవాద మిత్రులు. వీరబాబు ఎం.ఎల్.ఏ. జాకెట్ జానకి రామ్(జయప్రకాష్ రెడ్డి) కు వీర అనుచరుడు.అతని మంత్రి పదవి కోసం 25 జంటలకు పెళ్లి చేసే ప్రయత్నంలో భాగంగా ఒక జంట తగ్గితే సూరిబాబు ను పెళ్ళికొడుకుగా నటించమని చెప్పి పుష్ప (నందిని) అనే ఒక “పాప”తో ఉత్తితి పెళ్లి జరిపిస్తాడు వీరబాబు.పాపం అప్పటికే సూరిబాబు కు కృష్ణవేణి(పూర్ణ) తో పెళ్లి నిశ్చయమై ఉంటుంది. అసలే మహాజనానికి మరదలు పిల్లలాంటి పుష్ప తో పెళ్ళివార్త గుప్పుమనటంతో సూరిబాబు ను ఛీ కొడుతుంది కృష్ణవేణి .ఇప్పుడు పుష్ప అనే ఆ బోరింగ్ పాపను వదిలించుకోవటం కోసం సూరిబాబు పడే కష్టాలు ఒకవైపు, పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తానని వాసంతి (చిత్రా శుక్లా )దగ్గర 10 లక్షలు తీసుకున్న వీరబాబు కష్టాలు మరోవైపు తరుముతుంటే తప్పించుకోవడానికి ఆ “సిల్లీ ఫెలోస్” తోపాటు ఆ కథ ఎన్ని మలుపులు తిరిగిందో,ఎంత హాస్యం పండిందో తెర మీద నే చూడాలి.

నిజానికి ఇలాంటి కాంప్లికేటెడ్ స్క్రిప్టును హాండిల్ చేయటం చాలా కష్టం. టూ మెనీ క్యారెక్టర్స్, టూ మచ్ యాక్టివిటీతో కూడిన ఇలాంటి కథను డీల్ చేయటం దర్శకుడికి కత్తిమీద సాము లాంటిదే.అయితే ఈ తరహా సబ్జెక్టును అవలీలగా డీల్ చేయగలనని “సుడిగాడు” సూపర్ హిట్ తో నిరూపించుకున్నారు భీమినేని శ్రీనివాసరావు. ఇప్పుడు మరోమారు అలాంటి కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే తో వచ్చిన భీమనేని ” కేవలం రెండు గంటల నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వటమే లక్ష్యంగా ఈ సినిమా చేస్తున్నాము.లాజిక్స్ కోసం వెతక్కుండా సరదాగా నవ్వుకోవటానికే మా సినిమా చూడండి” అని ప్రేక్షకులను ముందుగానే ట్యూన్ చేయటం ప్లస్ అయింది.అలాంటి మైండ్ సెట్ తో థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకుడు టైం పాస్ కు ఎలాంటి ఇబ్బంది లేని షీర్ ఎంటర్టైనర్ “సిల్లీ ఫెలోస్” అనే కితాబు ఇవ్వటానికి ఏ మాత్రం వెనుకాడడు.

 

Silly Fellows Movie Review
  • Story
  • Direction
  • Screenplay
  • Performance
3

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here