కొంప ముంచిన మా వివాదం..వెనక్కి తగ్గిన మహేష్

Maa Association Controversy Forced Mahesh Babu To Cancel The Event,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Maa Association Controversy Latest News,Maa Association Controversy About Mahesh babu,Mahesh Babu to Reject MAA Offer, Hero Mahesh Babu in MAA Association Controversy, Actor Naresh about Namrata and Mahesh Babu
Maa Association Controversy Forced Mahesh Babu To Cancel The Event

గత కొద్దికాలంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు కాలం కలిసిరానట్టు ఉంది. ఏదో ఒక వివాదంతో రోడ్డున పడుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకూ వేరే వాళ్ల వల్ల పరువు పోయింది అనుకుంటే…ఇప్పుడు మా అసోసియేషన్ సభ్యులే ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకుని పరువును రోడ్డుకిడ్చారు. అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా నిధులను దుర్వినియోగం చేశారంటూ వివాదం రావడంతో అసలు కథ మొదలైంది. దీనికి సంఘం కార్యదర్శి నరేష్ మద్దతు పలకడంతో రెండు వర్గాలుగా చీలిపోయి..ఒకరి మీద విమర్శలు చేసుకోని ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టుకున్నారు. ఈ వివాదం కాస్త చిలికి చిలికి వానగా మారినట్టు…అటూ ఇటూ పోయి ఆఖరికి చిరంజీవి పేరు కూడా ప్రస్తావనకు రావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.

ఇదిలా ఉండగా.. ఇంత రచ్చ జరగడంతో సూపర్ స్టార్ మహేశ్ బాబు తన ఈవెంట్ ను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. నిజానికి మా వారు నెక్స్ట్ ఏర్పాటు చేయబోయే ఫండ్ రైజింగ్ ఈవెంట్ లో మహేష్ బాబు పాల్గొనాల్సి ఉంది. అక్టోబర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ ఈవెంట్ ను ‘మా’ సభ్యులు ఫిక్స్ చేశారు. అయితే, వివాదం నేపథ్యంలో ఇలాంటి సమయంలో తాను ఈ షోలో పాల్గొనడం మంచిది కాదనే భావనలో మహేష్ ఈ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నాడు. టూర్ క్యాన్సిల్ అవ్వడంతో ‘మా’ సభ్యుడైన బెనర్జీ మహేష్ భార్య నమ్రత వద్దకు వెళ్లి మీరైనా జోక్యం చేసుకోవాలని కోరారట. దానికి మహేష్ భార్య నమ్రత ఈ వివాదంతో తమకేమీ సంబంధం లేదని..టూర్ క్యాన్సిల్ చేశామని చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు చిన్నారుల ఆరోగ్యం కోసం ఎన్జీవో ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here