రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 2.0 టీజర్ టైమ్ ఫిక్స్

2.0 Teaser Release Date And Time Confirmed,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Super Star RajiniKanth Movie 2.0 Teaser Updates,2.0 Teaser Release Date Fixed, Rajinikanth Movie 2.0 Teaser Release Date Locked, 2.0 Teaser Latest News,Rajinikanth 2.0 Telugu Movie Teaser News
2.0 Teaser Release Date And Time Confirmed

తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ కాంబినేషన్లో 2010 లో రోబో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లోనే ఆ రేంజ్ లో గ్రాఫిక్స్ వాడిన చిత్రంగా ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ లో 2.0 సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి అభిమానులు ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా టీజర్ రిలీజ్ విషయంలో మాత్రం వాయిదా పడుతూనే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది.

ఎట్టకేలకు టీజర్ విడుదల టైమ్ ఖరారు చేశారు చిత్రయూనిట్. 2.0 టీజర్ (త్రీడీ) ఈ నెల 13న వినాయక చవితి పండుగ సందర్బంగా మీ ముందుకు వస్తుందని శంకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. అంతేకాదు అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమా టీజర్ 13న వస్తుందని తెలుపుతూ తన పాత్రకు సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను షేర్ చేశాడు.

కాగా ఈ మూవీలో అమీజాక్సన్, అదిల్ హుస్సేన్, సుదన్షు పాండే, అక్షయ్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ 2.0 చిత్రాన్ని సుమారు 400 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ఏఆర్‌ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఆ రేంజ్ లోనే ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here