ఓ ఇంటివాడు కానున్న దర్శకదీర రాజమౌళి తనయుడు..

Director Rajamouli Family Latest Updates, Director Rajamouli son gets Hitched, Director Rajamouli son Karthikeya Engagement News, Director Rajamouli son Karthikeya Wedding Engagement Updates, Latest Telugu Movies 2018, SS Rajamouli son Karthikeya and Pooja Engagement, SS Rajamouli Son Karthikeya Engagement, SS Rajamouli son SS karthikeya Wedding Details, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
SS Rajamouli son SS karthikeya Wedding Details

దర్శకధీరుడు రాజమౌళి కొడుకు కార్తికేయ ఓ ఇంటివాడు కానున్నాడు. ఇంతకీ వధువు ఎవరనుకుంటున్నారా…? ఎవరో కాదు. వీరమాచినేని రాజేంద్రప్రసాద్ మనవరాలు.. మన సీనియర్ హీరో జగపతి బాబు అన్న రాం ప్రసాద్ కూతురు పూజా ప్రసాద్. వీరిద్దరి నిశ్చితార్ధం నిన్న వారి నివాసంలో పెద్దల సమక్షంలో జరిగినట్టు తెలుస్తోంది. కుటుంబం సభ్యుల మధ్య జరిగిన నిశ్చితార్థ వేడుకకు పలువురు సినీ ప్రముఖలు హజరైనట్టు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది చివరిలో వారి వివాహం జరగనున్నట్టు సమాచారం.

కాగా కార్తికేయ ప్రస్తుతం రాజమౌళి చిత్రాలకు లైన్‌ ప్రొడ్యూసర్‌గా, సెకండ్‌ యూనిట్ దర్శకుడిగా పనిచేస్తున్నాడు. అంతేకాదు.. పలు చిత్రాల ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న పూజా ప్రసాద్ భక్తి గీతాలను ఆలపించడం ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా బాహుబలి రిలీజ్‌ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి.. ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (వర్కింగ్ టైటిల్‌) ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.

అంతేకాదు పూజతో నిశ్చితార్థం జరిగిన విషయాన్ని కార్తికేయ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. అవును పూజతో నూతన జీవితం ప్రారంభించడానికి ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నానంటూ కార్తికేయ ట్వీట్ చేశాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here