సొంత సినిమాను స్వయంగా ప్రకటించిన ప్రభాస్

Prabhas20 New Movie Announcement,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Prabhas New Project Details, Young Rebel Star Prabhas New Movie Updates,Prabhas Latest Telugu Movie News,Prabhas Upcoming Film News,Hero Prabhas Latest News,#Prabhas20
Prabhas20 New Movie announcement

సాధారణంగా సినిమా ఎనౌన్క్మెంట్స్ దర్శకనిర్మాతల నుండి వస్తాయి.హీరోలు వాటిని టాగ్ చేస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా బాహుబలి స్టార్ ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని తానే ప్రకటించి అభిమానులను హ్యాపీ చేశారు. కొద్దిసేపటి క్రితం ప్రభాస్ తన తదుపరి చిత్రం గురించి తానే స్వయంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా గురించిన ప్రాథమిక వివరాలు ఇప్పటికే అందరికి తెలిసినప్పటికీ అఫిషియల్ గా ఒక ప్రకటన రావటం ఇదే ప్రధమం.అదీ ప్రభాస్ స్వయంగా తన ఫేస్ బుక్ లో ఈ సినిమా గురించి ప్రస్తావించడం విశేషం.

జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో త్రిభాషా చిత్రంగా తన తదుపరి చిత్రం త్వరలోనే ప్రారంభం కానుందని, అందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందని,గోపీకృష్ణ మూవీస్ యూ వీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయనీ ఆ ఫేస్ బుక్ పోస్ట్  లో పేర్కొన్నారు ప్రభాస్. ఇలా ప్రభాస్ నుండే స్వయంగా ప్రకటన రావటంతో ఇందులో హీరోయిన్ ఎవరు అనే సందేహానికి కూడా తెర పడింది.పూజా హెగ్డే హీరోయిన్ అని గతంలోనే న్యూస్ వచ్చినప్పటికీ కొన్ని వెబ్సైట్స్ డౌట్స్ వ్యక్తం చేయడంతో ఆ విషయంలో కొంత సస్పెన్స్ నడిచింది.ఇప్పుడు ప్రభాస్ ప్రకటనతో ఆ డౌట్ కూడా క్లియర్ అయింది.

కాగా 5 సంవత్సరాల పాటు బాహుబలి కి అంకితమైన ప్రభాస్ బిర్లా తరువాత ఇన్నేళ్లకు సొంత బ్యానర్ గోపికృష్ణ మూవీస్ కు సినిమా చేయడం సాధ్యపడుతుంది. ఇది రెబల్ స్టార్ కృష్ణంరాజు అభిమానులు,యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు సెలెబ్రేట్ చేసుకునే హ్యాపీ న్యూస్.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here