మలయాళ నటులపై ఆగ్రహం వ్యక్తం చేసిన టూరిజం మినిష్టర్

Kerala Tourism Minister Slams Malayalam Actors,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Kerala Tourism Minister Slams Malayalam Stars,Kerala Tourism Minister Talks on Kerela Floods,Malayalam Stars Should Learn from Prabhas,Kerala Tourism Minister About Prabhas
Kerala Tourism Minister Slams Malayalam Actors

కేరళ రాష్ట్రం లో భారీ వర్షాలు,వరదలు సంభవించడం తో వందల సంఖ్యలో ప్రజలు మృతి చెందడం,లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు అయిన విషయం తెలిసిందే. కేరళ రాష్ట్రం లోని 14జిల్లాలలో 13జిల్లాలు జలదిగ్బంధం లో ఉండటంతో భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈ విపత్కర పరిస్థితులలో తమిళ చిత్ర పరిశ్రమ,తెలుగు చిత్ర పరిశ్రమ స్పందన అనూహ్యం. కోలీవుడ్ నుండి,టాలీవుడ్ నుండి భారీగా విరాళాలు కేరళ ప్రభుత్వానికి అందాయి. మల్లువుడ్ నుండి అందిన విరాళాలు స్వల్పమని సమాచారం.

యంగ్ రెబల్ స్టార్ కోటి రూపాయలు విరాళం ఇచ్చారని,అతనిని చూసి కోట్ల లో పారితోషికాలు తీసుకునే మలయాళ సూపర్ స్టార్లు ఎంతో నేర్చుకోవాల్సి ఉందని కేరళ స్టేట్ టూరిజం శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో సురేంద్రన్ మలయాళ నటులపై ఆగ్రహం వ్యక్తపరిచారు. కేరళలో సూపర్ స్టార్స్ చాలామంది ఉన్నారని,వారెవరూ చేయని పనిని, ఒక్కమలయాళీ సినిమాలో కూడా నటించని ప్రభాస్ చేశారని, కోటి రూపాయలు విరాళం ఇచ్చారని ప్రశంసించారు. గుప్త దానాలు చేసే ప్రభాస్ కోటి రూపాయలు విరాళం ఇచ్చినట్టుగా మంత్రి మాటల ద్వారా స్పష్టమయింది

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here