సుప్రీమ్,పటాస్,రాజా ది గ్రేట్ వంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్,మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా మల్టీ స్టారర్ F2 ఫన్ &ఫ్రస్టేషన్ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది. F2 సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తేదీ రిలీజ్ కానుంది.
F2సినిమాలోని కొన్ని సాంగ్స్,సీన్స్ చిత్రీకరణకు యూరోపియన్ సిటీ ప్రాగ్ కు చిత్ర యూనిట్ సెప్టెంబర్ 2వ తేదీ వెళ్ళారు. ఈ రెండు వారాల షూటింగ్ షెడ్యూల్ లో హీరో,హీరోయిన్స్ వెంకటేష్,వరుణ్ తేజ్,తమన్నా,మెహరీన్ పాల్గొంటున్నారు. నిర్మాత దిల్ రాజు,వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఫిదా,తొలిప్రేమ సినిమాలు సూపర్ డూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. F2 సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి.
