బాలకృష్ణ రిలీజ్ చేయనున్న అరవింద సమేత ఆడియో ?

Aravindha Sametha Movie Audio Launch Chief Guest Confirmed,Aravind Sametha Movie Audio Release Function Chief guest,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Balakrishna as Chief guest for Aravind Sametha Audio Launch Event,Aravind Sametha Audio Launch Function Latest News, Nandamuri Balakrishna Chief Guest at NTR Aravinda Sametha Audio Launch,Aravind Sametha Movie Latest News
Aravindha Sametha Movie Audio Launch Chief Guest Confirmed?

నటుడు,రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ 29 వ తేదీ ఉదయం నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తో నందమూరి కుటుంభం సభ్యులు ఏకమయ్యారు. హరికృష్ణ అంత్యక్రియలు ముగిసిన తరువాత జూనియర్ ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ లతో బాలకృష్ణ అనుబంధం వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది. బాలకృష్ణ కు జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య గొడవలున్నాయనే పుకార్లకు బాలకృష్ణ చెక్ పెట్టారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా అక్టోబర్ 11వ తేదీ రిలీజ్ కానుందని తెలిసిందే.అరవింద సమేత సినిమా ఆడియో రిలీజ్ సెప్టెంబర్ 16 వ తేదీ నోవాటెల్ లో జరపాలని చిత్ర యూనిట్ భావించారు. నందమూరి కుటుంబం లో అనూహ్య సంఘటన జరగటంతో ఆడియో ఫంక్షన్ ను అక్టోబర్ మొదటి వారం లో జరపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్టుగా సమాచారం. అరవింద సమేత ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు బాలకృష్ణ ను  ముఖ్యఅతిథిగా ఎన్టీఆర్ ఆహ్వానించారని సమాచారం. ఒకే వేదిక పై నందమూరి నట సింహం,యంగ్ టైగర్ కనపడితే నందమూరి అభిమానులకు పండుగే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here