సిల్లీ ఫెలోస్ ట్రైలర్ విడుదల చేసిన మహేశ్ బాబు..

Mahesh Babu Releases Silly Fellow Trailer,Mahesh Babu Launched By Silly Fellow Trailer,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Silly Fellow Trailer,Silly Fellow Movie Trailer,Silly Fellow Movie Official Trailer,Silly Fellow Trailer Launch By Mahesh Babu,Silly Fellow Telugu Movie Updates,Allari Naresh Upcoming Projects
Mahesh Babu Releases Silly Fellow Trailer

కామెడీ స్టార్స్‌ అల్లరి నరేష్‌, సునీల్‌లు హీరోలుగా సిల్లీ ఫెలోస్‌ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ను చూస్తే… ఈ సినిమాలో పంచ్ డైలాగ్స్ నవ్వులు పూయించారు. తన పెళ్లిని గురించి ఆలోచిస్తూ, “ఒక విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ. ఒక వీరబాబు, వాసంతి..ఆహా” అనడం.. నరేశ్, హీరోయిన్ ఫైట్ చేస్తూ, “మణిగంధం బహిర్ముఖం” అంటూ ‘బాహుబలి’ డైలాగ్‌ చెప్పగానే, పోసాని కృష్ణమురళి నోటి నుంచి ‘సారీ మిస్టర్‌ రాజమౌళి’ అని అనడం నవ్వులు పూయించాయి. మరి సునీల్, అల్లరి నరేష్ కాంబో కాబట్టి సినిమా మొత్తం కామెడీకి ఏం ఢోకా ఉండదని అర్ధమవుతోంది. ఇక మహేష్ బాబు ట్రైలర్ రిలీజ్ చేయడంతో సినిమాకి ఇంకా క్రేజ్ పెరిగింది. ఇక ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు చిత్ర యూనిట్ ఆల్ ద బెస్ట్ కూడా చెప్పారు తన ట్విట్టర్ ద్వారా.

కాగా అల్లరి నరేష్‌ హీరోగా సుడిగాడు సినిమాను తెరకెక్కించిన భీమినేని శ్రీనివాస్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూర్ణ, చిత్ర శుక్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here