అమర్ అక్బర్ అంటోని ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

Amar Akbar Antony First Look Release Date Locked,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Ravi Teja Upcoming Movie Updates,Amar Akbar Antony Telugu Movie First Look Release Date Fixed,Amar Akbar Antony Movie First Look Release Date Confirmed,Amar Akbar Antony Movie Updates,Amar Akbar Antony Telugu Movie Latest News,Amar Akbar Antony Movie First Look,Mass Maharaja Ravi Teja Amar Akbar Antony Movie First Look Release Date Locked
Amar Akbar Antony First Look Release Date Locked

శ్రీను వైట్ల, మాస్ మహరాజ్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన వెంకీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్ని సార్లు చూసినా చూడలనిపించే సినిమా అది. సినిమా ఆధ్యాంతం కామెడీతో నవ్వించేస్తాడు. ఇప్పుడు మళ్లీ అదే కాంబో రిపీట్ అవ్వబోతున్న సంగతి కూడా తెలిసిందే. శ్రీనువైట్ల, రవితేజ కాంబోలో ప్రస్తుతం అమర్ అక్బర్ అంటోని అనే కొత్త కాన్సెప్ట్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. సినిమాలో ఏదో కొత్తదనం ఉండబోతుందన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 27న సాయంత్రం 6.30 నిమిషాలకు ఈ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లు శ్రీనువైట్ల తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

కాగా చాలా గ్యాప్ తర్వాత రవితేజ, ఇలియానా ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here