గీత గోవిందం కు కలెక్షన్ల వర్షం

Raining Collections for Geetha Govindam,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Geetha Govindam Collections,Geetha Govindam Movie Collections,Geetha Govindam Box Office Collections,Vijay Deverakonda Geetha Govindam Raining Collections
Raining Collections for Geetha Govindam

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవర కొండ.. ‘గీత గోవిందం’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దగ్గరయ్యాడు. ఇక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఆగష్ట్ 15 న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక్కడే కాదు.. బాలీవుడ్ సినిమాలు కూడా ‘గీతగోవిందం‘ సినిమా కలెక్షన్ల ముందు నిలవలేకపోతున్నాయి. తొలిరోజునే 16.40 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, ఈ ఏడాదిలో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన టాప్ టెన్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకుంది.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. తొలి 5 రోజుల్లో ఈ సినిమా 55 కోట్ల గ్రాస్ ను .. 31కోట్ల షేర్ ను సాధించింది. దీంతో చాలా తక్కువ సమయంలోనే 50 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమాగా నిలిచింది. మరి ఈ కలెక్షన్లు ఇలానే సాగితే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి కూడా చాలా ఈజీగా చేరే అవకాశం ఉంది. 100 కోట్ల క్లబ్ లోకి చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి చూద్దాం ఆ మార్కును దాటుతుందో లేదో..

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here