సర్కార్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Latest Telugu Movie, Latest Telugu Movies 2018, Sarkar Movie Teaser Release Date Revealed, Sarkar Movie Updates, Sarkar Teaser, Sarkar Teaser Release Date Locked, Sarkar Telugu Movie Teaser Release Date Fixed, Telugu Film Updates, Telugu Filmnagar, Thalapathy Vijay Sarkar Teaser Date, Tollywood Cinema Latest News
Sarkar Teaser Release Date Locked

ఇటీవ‌ల‌ మెర్స‌ల్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఇలయదళపతి విజయ్ ఇప్పుడు సర్కార్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విజయ్ కు తమిళ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక రకంగా మన తెలుగుకు పవన్ కళ్యాణ్ ఎలాగో.. తమిళ్ లో విజయ్ అలాగ. విజయ్ సినిమా కోసం అంతలా అభిమానులు ఎదురుచూస్తుంటారు.

ప్రస్తుతం విజయ్ స్టార్‌ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సర్కార్ సినిమాలో నటిస్తున్నాడు. తెలుగు, త‌మిళ భాష‌ల‌్లో ఈ సనిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను, టైటిల్ ను ఆయన పుట్టిన రోజు (జూన్ 22) న విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సెప్టెంబర్ 13న వినాయక చవితి సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్ ను విడుద‌ల చేయడానికి ప్లాన్ చేశారు. దీనిపై త్వ‌ర‌లో అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో విజ‌య్ సరసన కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుండగా… వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. దీపావ‌ళికి సర్కార్ మూవీని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి విజ‌య్ – మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తుపాకి, క‌త్తి సినిమాలు ఎంత ఘన విజయం సాధించాయో తెలుసు.. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుంది.. హ్య‌ట్రిక్ కొడ‌తారా లేదా అనేది తెలియాలంటే సినిమా వచ్చేంతవరకూ ఆగాల్సిందే.

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here