కేరవాన్ లో సంగీత చర్చలా !?

Music Composition in Caravan,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Latest Telugu Movie,Telugu film Updates, Latest Telugu Movies 2018,Director Trivikram Srinivas Latest News,Director Trivikram Srinivas Movie Details,Trivikram Srinivas about Music Composition in Caravan,Trivikram Srinivas Upcoming Projects

సంగీత దర్శకులకు షూటింగ్ స్పాట్ లో పనేమీ ఉండదు.మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రొడక్షన్ ఆఫీసులో గానీ ,లేక నిర్మాతలు ఎరేంజ్ చేసే గెస్ట్ హవుస్ లోనో,ఫార్మ్ హవుస్ లోనో జరుగుతాయి.ఆ తరువాత రికార్డింగ్ థియేటర్ లో సాంగ్స్ రికార్డింగ్ చేసుకుంటారు. కానీ షూటింగ్ స్పాట్ లో మ్యూజిక్ డైరెక్టర్ కు ఒక కేరవాన్ బుక్ చేసి అందులో సంగీత చర్చలు జరపడం ఎప్పుడూ వినలేదు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత …చిత్రం మ్యూజిక్ డిస్కషన్స్ షూటింగ్ స్పాట్ లో జరిగాయట. ఒక వైపు షూటింగ్ జరుగుతుండగా ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్ కోసం ప్రత్యేకంగా ఒక కేరవాన్ బుక్ చేసి అందులో మ్యూజిక్ సిట్టింగ్స్ చేశారట.

దర్శకుడు త్రివిక్రమ్ షూటింగ్ మధ్యలో ఉండే షాట్ గ్యాప్ లో వచ్చి ట్యూన్స్ విని ఓ కే చేసుకునేలా ఏర్పాటు చేసుకున్నారట. ‌సాధారణంగా ఇది రెగ్యులర్ ప్రొడక్షన్ నామ్స్ కు విరుద్ధం. అయితే టైమ్ లేనప్పుడు ,టైమ్ కుదరనప్పుడు అనివార్య పరిస్థితుల్లో ఇలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోక తప్పదు. కానీ ఇప్పుడీ విషయంలో మీడియా దర్శకుడు త్రివిక్రమ్ వైపు వేలెత్తి చూపుతుంది. నిర్మాత డబ్బుకు జవాబుదారీతనం లేకుండాపోతుంది…మ్యూజిక్ డైరెక్టర్ కోసం కేరవాన్ బుక్ చేయటం నిర్మాతకు ఎంత బర్డెన్? ఇలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి …త్రివిక్రమ్ సినిమాల్లో ఇలాంటి దుబారా సర్వసాధారణమైపోయింది అంటూ కొన్ని వెబ్సైట్స్ త్రివిక్రమ్ తీరును తూర్పారబట్టాయి . అయితే ఒక ఫిక్సడ్ డేట్ కు సినిమా ను పూర్తి చేసి రిలీజ్ చెయ్యాలంటే ఇలాంటి వైలేషన్స్ తప్పదు.మ్యూజిక్ డైరెక్టర్ కోసం బుక్ చేసిన కేరవాన్ కు మహా అయితే 3 వేలు ఖర్చు అవుతుంది.కానీ అనుకున్న టైం కు సినిమా పూర్తి కాకపోతే ఆ నష్టం కోట్లలో ఉంటుంది.

అయితే మీడియా ఈ విషయాన్ని పాయింట్ ఔట్ చేయడంలో తప్పేమీ లేదు. ఇప్పుడంటే ఇది ఎమర్జెన్సీ మ్యాటర్ కాబట్టి తప్పదు.కానీ ఇన్ జనరల్ గా సినిమా ప్రొడక్షన్స్ లో జరిగే దుబారను,వేస్టేజిని చూస్తే ఎవరికైనా కడుపు రగిలిపోతుంది. అత్త సొమ్ము అల్లుడి దానం,నీది కాకపోతే ఢిల్లీ దాకా దేకమనటం,సొమ్మొకడిది సోకొకడిది వంటి సామెతలకు కరెక్టుగా సరితూగే పరిస్థితులు ఇక్కడ నిత్యకృత్యాలు. నిర్మాత రూపాయికి గానీ , అతని మాటకు గానీ విలువ ఉండదు. ఏ రంగంలోనైనా ఇచ్చేవాడి చెయ్యి పైన తీసుకునేవాడి చెయ్యి కిందా ఉంటుంది. కానీ ఒక్క సినిమా రంగంలో మాత్రమే ఇచ్చేవాడి చెయ్యి కింద తీసుకునేవాడి చెయ్యి పైన ఉంటాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here