దిల్ రాజు- సతీష్ వేగేశ్న కాంబినేషన్లో మరో సినిమా..!

Dil Raju and Satish Vegesna New Movie, Dil Raju and Satish Vegesna to Team Up for Another Film, Director Satish Vegesna Next Movie With Dil Raju, Latest Telugu Movies News, Satish Vegesna and Dil Raju team up Once Again, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates
Dil Raju and Satish Vegesna to Team Up for Another Film

నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో ఇప్పటికే ‘శతమానం భవతి‘, ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు కూడా కుటుంబ కథా చిత్రాలు కావడం..బంధాలు, బాంధవ్యాలకు విలువ ఇచ్చే కంటెంట్ ఉండటంతో ప్రేక్షకులు ఆదరించారు. ‘శతమానం భవతి’ సినిమా అంత రేంజ్ లో హిట్ కొట్టనప్పటికీ.. ‘శ్రీనివాస కళ్యాణం‘ సినిమా కూడా బాగానే ప్రజాదరణపొందింది. నిజానికి నిర్మాతగా దిల్ రాజు కానీ.. డైరెక్టర్ గా సతీశ్ వేగేశ్న కానీ ఈ సినిమా వల్ల ఫెయిల్ అవ్వలేదు. ఇప్పుడొస్తున్న జోనర్లలో కాస్త ఢిపరెంట్ గా వచ్చిన సినిమా కాబట్టి.. జనాలకు కాస్త నిదానంగా ఎక్కుతుంది. ఓ రకంగా ఈ సినిమా మెరల్ హిట్ అని చెప్పొచ్చు. కలెక్షన్ల పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాప కింద నీరులా..సైలెంట్ గా కలెక్షన్లను రాబడుతూనే ఉంది.

అందుకే దిల్ రాజు, డైరెక్టర్ సతీష్ వేగేశ్న కలిసి ముచ్చటగా మూడో సినిమా తీయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజే చెప్పినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాకు థాంక్యూ అని టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారట. త్వరలోనే ఈ కథకు పూర్తి రూపాన్ని తీసుకొచ్చి సెట్స్ పైకి తీసుకెళతారట. మరి టైటిల్ అయితే క్యాచీగా.. కూల్ గా రోజూ మనం వాడుకునే పదమే కాబట్టి ఈజీగా జనాలకి ఎక్కేస్తుంది. మరి దీనిపై ఇంకా క్లారిటీ రావాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here