ఎన్టీఆర్ బయోపిక్.. చంద్రబాబు భార్య పాత్ర సెలక్ట్..!

Latest Telugu Movies News, Manjima Mohan Plays Chandra Babu wife In NTR Biopic, NTR Biopic gets a New Addition to play Chandra Babu wife, NTR Movie Updates, NTR Telugu Movie Latest News, NTR Upcoming Movie 2018, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates
Chandrababu Naidu Wife Character in NTR Biopic

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో నటులను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు దర్శకుడు క్రిష్. ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం.. అందులోనూ ఎన్టీఆర్ బయోపిక్ కావడంతో చాలా కేర్ ఫుల్ గా నటీ నటులను ఎంచుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ తనయుడు కావడం వల్ల లీడ్ రోల్ లో బాలకృష్ణ నటిస్తున్నాడు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం విద్యాబాలన్ ను సలెక్ట్ చేశారు. ఈ సినిమాలో మరో కీలక పాత్ర చంద్రబాబు నాయుడిది. ఈ పాత్ర కోసం కూడా రానాను సెలెక్ట్ చేశారు చిత్ర యూనిట్. మరో కీలకమైన పాత్ర అయిన ఏఎన్నార్ పాత్రలో ….అక్కినేని వారసుడు సుమంత్ నటించబోతున్నాడు.

ఇప్పుడు తాజాగా చంద్రబాబు భార్య భువనేశ్వరి పాత్ర కోసం కూడా ఓ హీరోయిన్ ను ఎంపిక చేశారట క్రిష్. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మంజిమా మోహన్. మంజిమా మోహన్ ను నారా భువనేశ్వరి పాత్రకోసం సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు మంజిమా మోహన్ ఈ పాత్రకు న్యాయం చేస్తుందని క్రిష్ అనుకున్నారట.. అందుకే ఈమెను సెలెక్ట్ చేసినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. మరి ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో తన సైలెంట్… ఇన్నోసెంట్ లుక్స్ తో అందరినీ మెప్పించిన మంజిమా మోహన్.. భువనేశ్వరి పాత్రతో ఎంత వరకూ మెప్పిస్తుంది..? క్రిష్ నమ్మకాన్ని నిలబెడుతుందా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here