మహర్షి – సైరా ల రిలీజ్ డేట్ క్లాష్ అయ్యే అవకాశం ఉందా !?

Syee Raa Maharshi Release Date Clash?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu FIlm News 2018,Tollywood Movie Updates,Sye Raa Movie Updates,Sye Raa Telugu Movie Latest News,Sye Raa Movie Release Date,Sye Raa Telugu Movie Release Date,Maharshi Movie Updates,Maharshi Telugu Movie Latest News,Maharshi Movie Release Date,Maharshi Telugu Movie Release Date,Clash Between Sye Raa And Maharshi Movies Release Dates
Syee Raa Maharshi Release date clash?

రెండు భారీ చిత్రాలు పోటా పోటీగా రిలీజ్ అవటం సెన్సేషన్ క్రేయేట్ చేయవచ్చునేమోగానీ అది ఉభయులకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇది గతంలో చాలాసార్లు రుజువయ్యింది. ఇప్పుడు అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రెండు భారీ చిత్రాల విషయంలో కూడా ఇలాంటి పోటీ అనివార్యం అవుతుందా అన్న చర్చ ఇండస్ట్రీలో జరుగుతుంది . మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న సైరా నరసింహా రెడ్డి చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.మరోవైపు మహేష్ బాబు టైటిల్ రోల్ చేస్తున్న’మహర్షి ‘ షూటింగ్ ఫాస్టుగా జరుగుతుంది .ఈ చిత్రాన్ని 2019 ఏప్రిల్ 5 న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సమాయత్తమౌతున్నారట . అయితే ఇంతలో సైరా కూడా అదే రోజున రిలీజ్ చేస్తారనే వార్త ఒకటి గుప్పుమంది.ఇందులో నిజానిజాలు ఏమిటో తెలియకపోయినా ఇలా జరిగితే ఇంకేమైనా ఉందా అన్నట్లు కథనాలు రాస్తున్నాయి కొన్ని వెబ్సైట్లు.

నిజానికి మహర్షి ఏప్రిల్ 5 న రిలీజ్ అన్న వార్త గత కొన్ని రోజులుగా సర్క్యులేషన్ లో ఉంది.ఇక సైరా గురించి నిర్మాతల నుండి ఎలాంటి ప్రకటన రాలేదు.ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ మీడియా కథనాలు రాసి కంగారుపడటం,కంగారుపెట్టడం కరెక్ట్ కాదు.ఒక వేళ రెండు సినిమాలు ఒకే డేట్ న రిలీజ్ కు రెడీ అయితే వాళ్లలో వాళ్లే సర్దుబాటు చేసుకొని డేట్ మార్చుకునేంత అండర్స్టాండింగ్ వాళ్ళ మధ్య ఉంది . ఈ లోపుల మీడియా కథనాలవల్ల అభిమానుల మధ్య చిన్న స్పర్ధ పెరిగే అవకాశం ఉంది ..కాబట్టి అధికారిక ప్రకటనలు వచ్చే దాకా మీడియా కొంత సంయమనం పాటిస్తే మంచిది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here