జనాలలో క్రేజ్ పెంచుతున్న శ్రీనివాస కళ్యాణం

Srinivasa Kalyanam Ascends Excitement in Public,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu FIlm News 2018,Tollywood Movie Updates,Srinivasa Kalyanam Movie Updates,Srinivasa Kalyanam Telugu Movie Latest News,Srinivasa Kalyanam Movie Public Response,Srinivasa Kalyanam Telugu Movie Public Talk,Srinivasa Kalyanam Movie Getting Good Response In Public
Srinivasa Kalyanam Ascends Excitement in Public

కుటుంబ కధా చిత్రాలకు ప్రేక్షకాదరణ దరణ ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే కమర్షియల్ చిత్రాల వలె ఒకటి రెండు రోజులలోనే సినిమాల రిజల్ట్ ఇమ్మీడియట్ గా తెలియదు. కుటుంబ కధా చిత్రాలు క్రమేణా ప్రేక్షకాదరణ పొందుతాయి. శతమానం భవతి వంటి సక్సెస్ ఫుల్ కుటుంబ కధా చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వం లో పెళ్ళి నేపధ్యం లోశ్రీనివాస కళ్యాణం సినిమా రూపుదిద్దుకుంది. ఘనంగా,ఆడంబరంగా జరిగే పెళ్ళి లా కాకుండా,సాంప్రదాయబద్ధంగా పెళ్ళి జరుపు కొనే తీరు బంధాలు,అనుబంధాలు విలువల గురించి తెలియజేసే చిత్రమే శ్రీనివాస కళ్యాణం.

హీరో నితిన్,రాశిఖన్నా జంటగా నటించిన ఈ సినిమాలో నందితా శ్వేత మరొక ముఖ్య పాత్రలో నటించారు. ప్రకాష్ రాజ్,జయసుధ,సితార ఇతర తారాగణం.మిక్కీ జ్ మేయర్ కంపోజ్ చేసిన సంగీతం ఆహ్లదకరం, సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం కనువిందు చేశాయి. శ్రీ వెంకటేశ్వ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన శ్రీనివాస కళ్యాణం సినిమా నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు వినూత్న పబ్లిసిటీ చేశారు. శ్రీనివాస కళ్యాణం సినిమా రిలీజయిన థియేటర్స్ వద్ద మంగళ తోరణాలు,మంగళ వాద్యాలు ఏర్పాటు చేయడం ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. శ్రావణ మాసం లో పెళ్లి చేసుకునే జంటలకు KLM సౌజన్యంతో పట్టు వస్త్రాల బహూకరించాలనుకొనడం నిర్మాత దిల్ రాజుకే చెల్లింది. శ్రీనివాస కళ్యాణం సినిమాకు మహిళాదరణ పెరుతుందనడంలో సందేహం లేదు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here