శరవేగంగా మణిరత్నం భారీ మల్టీస్టారర్ షూటింగ్

Latest Telugu Movies News, Nawab Latest Movie, Nawab Latest Movie 2018, Nawab locked in on a release date, Nawab Movie release date, Nawab Movie release date Locked, Nawab Movie Releasing On 28th September, Nawab Release Date Confirmed, Nawab release date Fixed, Nawab Telugu Movie Release Date Locked, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Nawab Telugu Movie Release Date Locked

చెలియా సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచిన మణిరత్నం ఓ భారీ మల్టీ స్టారర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్‌, మరియు లైకా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘చెక్క చివంత వానం’ (తెలుగులో నవాబు) సినిమాలో శింబు, అరవింద్‌ స్వామి, విజయ్‌ సేతుపతి, అరుణ్‌ విజయ్‌లు అన్నదమ్ములుగా కనిపించనున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు అధికారింగాప్రకటించారు చిత్ర యూనిట్.

ఇదిలా ఉండగా ఈమధ్య మణి ఆరోగ్య సమస్యల కారణంగా కొద్ది రోజులు బ్రేక్‌ ఇచ్చిన చిత్రయూనిట్‌, తిరిగి పనులు ప్రారంభించారు. అంతేకాదు మణిరత్నం కూడా ఈ సినిమాను చాలా వేగంగా కంప్లీట్‌ చేయాలని చూస్తున్నారు. మరి ఇటీవల ‘ఓకె బంగారం’ సినిమా తప్ప మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చెలియా సినిమా విజయం సాధించలేదు. ఈ సినిమాతో అయినా మళ్లీ మణిరత్నం ఫామ్ లోకి వస్తారో.. లేదో..? తన మార్కును మరోసారి చూపిస్తారో లేదో..? చూద్దాం

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here