కోట్ల కొద్దీ ఖర్చుకు – 5 ఏళ్ల శ్రమకు ఫలితం ఇదా !?

Vishwaroopam 2 – Results of Five Years of Flesh and Blood,Telugu FIlmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Vishwaroopam 2 Movie Updates,Vishwaroopam 2 Telugu Movie Latest News,Vishwaroopam 2 Movie Review,Vishwaroopam 2 Movie Story,Vishwaroopam 2 Telugu Movie Review & Rating
Vishwaroopam 2 – Results of Five Years of Flesh and Blood

కమల్ హాసన్ అంటే విలక్షణ విశిష్ట నటనకు పెట్టింది పేరు. అతనొక ‘సినీ ప్రయోగశాల’ . దశాబ్దాల తన నట జీవితం మొత్తాన్ని ప్రయోగాల కోసం వెచ్చించిన ఒక అరుదైన కళాకారుడు. కళకు జాతి,మత ప్రాంతీయాది భేదాలు లేవని నిరూపించిన జాతీయ నటుడు. ఆయన జన్మతః ఒక ప్రాంతానికి,ఒక భాషకు చెందిన నటుడే అయినప్పటికీ ఆయనకు, ఆయన సినిమాలకు నేషనల్ ఫ్లాగ్ లాగా దేశమంతటా సెల్యూట్ లభిస్తుంది. చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత, పరిశోధన,పరిశ్రమ, ప్రయోగాత్మకత ఉండాలని పరితపించే ‘సెల్యూలాయిడ్ సై న్టిస్ట్ ‘ కమల్ హాసన్. అంతగా మనం అభిమానించి ,గౌరవించే కమలహాసన్ నుండి ఒక సినిమా వస్తుందీ అంటే దేశవ్యాప్తంగా ఒక ఎదురూచూపు ఉంటుంది. ఈ నేపధ్యంలో 5 ఏళ్లుగా ఎదురుచూసిన ‘ విశ్వరూపం 2 ‘ ఈ రోజు విడుదలయింది. స్వీయ దర్శకత్వంలో కమలహాసన్ నటించి నిర్మించిన ఈ సినిమా అంచనాలను ఏ మేరకు టచ్ చేసిందో చూద్దాం.

మన మిలిటరీ సీక్రెట్ ఏజెంట్ అయిన విశ్వం ( కమలహాసన్)టెర్రరిస్ట్ ఏజెంట్ రూపంలో పాకిస్థాన్ వెళ్లి అక్కడి టెర్రరిస్ట్ గ్రూపులతో కలిసి వాళ్ళ మనిషి లాగా వాళ్లను నమ్మించి సీక్రెట్ ఆపరేషన్ చేస్తుంటాడు. ఇది విశ్వరూపం ఫస్ట్ పార్ట్ లొనే ఎస్టాబ్లిష్ అయిన యాక్టివిటీ. ఇక సెకండ్ పార్ట్ లో ‘ రా’ ఏజెంట్ వీసామ్ గా పరిచయం అయిన కమల్ యూ ఎస్ ఆర్మీ కి ఆల్ ఖైదా గ్రూపులకు మధ్య జరిగే యుద్ధంలో వారితో పాటు సామాన్య ప్రజలను కూడా రక్షించే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడి ఇండియాకు షిఫ్ట్ చేయబడతాడు.ఇక్కడకు వచ్చాక కూడా టెర్రరిస్టుల వేట కొనసాగుతుతుంది .ఆ వేటలో టెర్రరిస్టులను ఎలా అంతమొందించాడు అన్నది మిగిలిన కథ. అయితే ఈ కథను తెరకు ఎక్కించే క్రమంలో కమలహాసన్ రాసుకున్న స్క్రీన్ ప్లే మొత్తం కంగాళీ గా తయారై ఆర్డర్ ఆఫ్ నరేషన్ విసుగు పుట్టిస్తుంది.

ఒక సన్నివేశాన్ని గానీ, ఒక షాట్ ను గానీ గొప్పగా తీయడం వేరు,టూ మచ్ రిస్కీ గా తియ్యడం వేరు.ప్రతి సన్నివేశాన్ని చాలా కాంప్లికేటెడ్ గా తియ్యాలన్న తపన కనిపిస్తుంది తప్ప అది కథా గమనానికి ఎంతవరకు అవసరం అన్న ఆలోచనే కొరవడటంతో ఈ సినిమా రిస్క్ ఎక్కువ ఇంపాక్ట్ తక్కువ అన్నట్టుగా తయారయింది. నిజానికి కమలహాసన్ లాంటి ఒక సినీ లెజండ్ తీసిన సినిమాలో లోపాలు వెతికి పట్టుకోవాలి అని ఏ క్రిటిక్ సాహసించడు. కానీ అలా చేయవలసిన పరిస్థితి వస్తే తప్పదు.ఇందులో ఏ ఒక్క సన్నివేశాన్ని సెట్టిల్డ్ గా తీసినట్లు అనిపించదు. స్థిమితంగా తాను తియ్యలేదు..ప్రేక్షకులను స్థిమితంగా చూడనివ్వలేదు. టూ మెనీ ఫ్లాష్ బ్యాక్ లు,టూ మెనీ కట్స్ తో స్క్రీన్ ప్లే లో టూ మచ్ కంఫ్యూజన్ క్రియేట్ చేశారు .

ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే పద్మశ్రీ డా కమలహాసన్ నటనకు ఇప్పుడు ఎవరూ కొత్తగా కితాబులు ఇవ్వవలసిన అవసరం లేదు. కథలో దమ్ము సన్నివేశంలో సత్తా లేకపోయినా కమల్ తన అద్భుత నటన తో కమాల్ చేయటం మనం జే జే లు కొట్టడం కొత్తేమీ కాదు. కమల్ సరసన నటించిన పూజా కుమార్,కో-ఏజెంట్ గా చేసిన ఆండ్రియా తమ అందం, అభినయాలతో అలరించారు. కమల్ తల్లిగా అల్జీమర్స్ పేషంట్ గా అలనాటి మేటినటి వహీదా రెహమాన్ నటించటం ఒక అదనపు ఆకర్షణ .

ఇక టెక్నికల్ గా ప్రత్యేకించి చెప్పాల్సింది ఏముంటుంది…technically its a great job. మహమ్మద్ గిబ్రాన్ సంగీతం,సాను జాన్ వర్గీస్ అండ్ శామ్ దత్ కెమెరా వర్క్ చాలా బాగున్నాయి .అలాగే మేకింగ్ స్టాన్డెర్డ్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి…లొకేషన్స్, బ్యాక్ డ్రాప్స్,ఫైట్స్ ఛేజింగ్స్ ఇలా అన్ని విషయాలలో గొప్ప రిచ్ నెస్ కనిపిస్తుంది . అయితే ఇలాంటి అదనపు ఆకర్షణలు ఒక బ్యాడ్ స్క్రిప్ట్ నుండి సినిమాను కాపడలేవు. కథలో,కథనంలో దమ్ము లేనప్పుడు ఈ టెక్నికల్ ఎక్సల్లెన్సీలు, హై లెవల్ మేకింగ్ లు సినిమాను సేవ్ చేయలేవు అనటానికి మరో తాజా ఉదాహరణగా నిలుస్తుంది ‘విశ్వరూపం 2’ ….With due excuses to Kamala Hassan The Great .

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here