మహిళాదరణ సొంతం చేసుకుంటున్న ‘శ్రీనివాస కళ్యాణం’

Latest Telugu Movie News, Srinivasa Kalyanam Appreciated by Female Audience, Srinivasa Kalyanam Movie Response, Srinivasa Kalyanam Movie Updates, Srinivasa Kalyanam Telugu Movie Appreciated by Female Audience, Srinivasa Kalyanam Telugu Movie Latest News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates
Srinivasa Kalyanam Appreciated by Female Audience

టెక్నాలజీ మారుతున్న కొద్ది జనాల ఆలోచలా విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఏ విషయాన్నై చాలా ఈజీగా తీసుకునే పరిస్థితికి వచ్చేశారు. ఈ రోజుల్లో బంధువులు, బాంధవ్యాలు, పెళ్లిళ్లు, సంప్రదాయాలు వాటి గురించి చెబితే ఏం వింటారు. ఇక కొంత మంది అయితే అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారో.. ఎందుకు విడిపోతున్నారో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. అలా పెళ్లి అంటే జస్ట్ ఏదో ఒక ఈవెంట్ లా భావించే యువతరానికి పెళ్లికున్న ప్రాముఖ్యత ఏంటో తెలియజేసే ప్రయత్నం చేశారు డైరెక్టర్ సతీష్ వేగేశ్న ‘శ్రీనివాస కళ్యాణం‘ ద్వారా.

ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నిర్మాత దిల్ రాజును అభినందించాల్సిందే. ‘బొమ్మరిల్లు’, ‘శతమానం భవతి’ లాంటి సినిమాలు తీసి పేరెంట్స్ కు, పిల్లలకు మధ్య ఉన్న దూరాన్ని కళ్ల ముందు కట్టినట్టు చూపించారు. ఇప్పుడు ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా ద్వారా పెళ్లి కున్న గొప్పదనం గురించి చెప్పి అందరి కళ్లు తెరిపించారు. ఆ పెళ్లి గురించి మాకు తెలుసులే.. పెళ్లి సంప్రదాయాల గురించి మాకు తెలుసులే అనుకునే వారికి ఈ సినిమా చూసిన తరువాత అసలు పెళ్లంటే ఇదా.?. పెళ్లి గురించి తెలుసుకోవాల్సింది ఇంత ఉందా.? అని అనిపించకమానదు. నిజానికి ఇందులో కథగా చెప్పటానికి ఏమీ లేదు కానీ..పెళ్లి అంటే ఏమిటో …పెళ్లి వేడుకలో ఉన్న సంప్రదాయ విలువలు ఏమిటో చక్కగా చెప్పారు డైరెక్టర్. పెళ్లికి సంబందించి ఇప్పటి వరకూ ఎన్నో కాన్సెప్ట్ లు వచ్చాయి.. ఎంతో మంది ఎన్నోరకాలుగా చూపించారు.. కానీ డెరెక్టర్ వేగేశ్న్ చూపించినంత గ్రాండ్ గా… పెళ్లికున్న ప్రాముఖ్యత గురించి చెప్పినట్టు వేరే ఏ ఒక్కరూ చెప్పలేదని చెప్పొచ్చు.

కమర్షియల్ సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ ఇలాంటి సినిమాలు రావడం మాత్రం చాలా తక్కువ. అందుకే సినిమా హిట్టా..ఫట్టా అనే కోణంలో చూడకుండా.. సబ్జెక్ట్ ను దృష్టిలో పెట్టుకొని ప్రతి ప్రేక్షకుడు సినిమా చూసి అందులో విలువలు గ్రహించాలి. పెళ్లిని, ఆ వాతవరణాన్ని చాలా అందంగా ఆహ్లాదకరంగా చూపిస్తూ, బంధువులను వారి మధ్య అనుబంధాలను చాలా చక్కగా చూపించడం వల్ల ఈ సినిమా ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాకు మహిళల ఆదరణ రోజు రోజుకీ పెరిగిపోతుంది. సెంటిమెంట్స్ కు ఎక్కువగా కనెక్ట్ అయ్యే మహిళలు… ఈ సినిమాలో పెళ్లి సందర్భంగా వచ్చే డెప్త్ సీన్లు మహిళలను కట్టి పడేస్తుండటం.. దానికి తోడు పెళ్లి, చీరలు, నగలు సందడి సందడి వాతావరణం ఉండటంతో మహిళలకు తెగ నచ్చేసింది. దీంతో షోకి షోకి మహిళల ఆదరణ పెరిగిపోతుంది. కేవలం ఓక వర్గం ఆడియన్సే టార్గెట్ కాకుండా.. చిన్నవారి నుండి పెద్ద వారి వరకూ అందరూ చూడదగ్గ చిత్రం ఈ శ్రీనివాస కళ్యాణం. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం చాలా ఉంది. దిల్ రాజు ఇంకా ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు ఎన్నో తీయాలని ఆశిద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here