శ్రీనివాస కళ్యాణం లో ఆ ఏడు సీన్స్ మీదే నా బ్యాంకింగ్

Director Satish Vegesna Comments On Srinivasa Kalyanam Telugu Movie, Latest Telugu Movie, Satish Vegesna About Srinivasa Kalyanam Movie, Satish Vegesna Interview With Telugu Filmnagar On Srinivasa Kalyanam, Seven Iconic Scenes from Srinivasa Kalyanam, Srinivasa Kalyanam Director Satish Vegesna Exclusive Interview With Telugu Filmnagar, Srinivasa Kalyanam Director Satish Vegesna Interview, Srinivasa Kalyanam Movie Director Satish Vegesna Interview, Telugu Flim Updates, Telugu flimnagar, Tollywood Cinema Latest News
Seven Iconic Scenes from Srinivasa Kalyanam

ప్రస్తుత లెంగ్త్ అండ్ డ్యూరేషన్ ప్రకారం సినిమాలో 60 నుండి 70 సీన్లు ఉంటాయి.అయితే కథా గమనం కోసం అన్ని సీన్లు ఉంటాయి గానీ నిజానికి సినిమాకు ఆయువుపట్టు లాంటి సన్నివేశాలు 7 నుండి 10 వరకు ఉంటాయి.ఏ దర్శకుడైనా వాటి మీదనే హోప్స్ పెట్టుకుంటాడు. అలాగని మిగతా సీన్స్ ను నిర్లక్ష్యం చేస్తాడని కాదు గానీ ఈ పర్టిక్యులర్ సీన్స్ నే తన బ్యాంకింగ్ సీన్స్ గా భావిస్తాడు.ఈ నేపథ్యంలో నిన్న రిలీజ్ అయిన ‘శ్రీనివాస కళ్యాణం‘ చిత్రంలో మీ బ్యాంకింగ్ సీన్స్ ఏమిటీ అని ఆ చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ ను అడగ్గా ఓ ఏడు కీలక సన్నివేశాలను తన ఛాయిస్ గా చెప్పారు .అవేమిటో తన మాటల్లోనే చూద్దాం .

‌1) సెకండ్ హాఫ్ లో పెళ్లికి ఎవరినీ వదలకుండా బంధు,మిత్రులందరినీ ఎందుకు పిలవాలో దాని వెనుక పరమార్ధం ఏమిటో జయసుధ గారు చెప్పే సన్నివేశం చాలా బాగుంటుంది. పెళ్లి కార్డులలో సకుటుంబ బంధు మిత్ర సపరివార సమేతంగా అని ఎందుకు వేస్తారో తెలియజేసే ఆ సన్నివేశం బావుంటుంది.

‌2) పెళ్లి బట్టలు కొనటానికి వెళ్ళినప్పుడు కొంతమంది కి తక్కువ రేటులో
‌ఇంకొంత మందికి ఎక్కువ రేటులో బట్టలు కొందాం అని వదిన చెప్పినప్పుడు అలా ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకోలాగా వేరుచేసి చూడటం మంచిది కాదని హీరో చెప్పడం అప్పుడు అందరూ అతన్ని మెచ్చుకోవటం నాకు బాగా నచ్చింది . ఈ సన్నివేశంలో తెర మీద ఇతర పాత్రల రియాక్షనే కాదు థియేటర్లో ప్రేక్షకుల రియాక్షన్ కూడా చాలా బాగుంది.

‌3) అందరూ గెట్ టూ గెదర్ లాగా కూర్చున్నప్పుడు హీరో పెళ్లి మీద ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పాలి అని చిన్న సింపోజియం లాంటిది కండక్ట్ చేసినప్పుడు పెళ్లి గురించి,భార్యాభర్తల అనుబంధం గురించీ రాజేంద్రప్రసాద్ చెప్పే ఒపీనియన్ చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ అక్షరాలలో డబ్లియూ షేప్ లో ఉండే ఎత్తుపల్లాల తో భార్యాభర్తల అనుబంధాన్ని పోల్చి చెప్పే సీన్ కు థియేటర్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

‌4) ఇదే సన్నివేశంలో భార్యాభర్తల అనుబంధం గురించి,వాళ్ళ మధ్య వచ్చే అభిప్రాయభేదాల గురించి ,ఆడవాళ్ల అల్పసంతోష మనస్తత్వం గురించీ నటి సితార చెప్పే అభిప్రాయం నాకు చాలా బాగా నచ్చింది . ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ లో మార్పుకు ఈ సన్నివేశం కీలకం అవుతుంది . సినిమాలోనే కాదు సమాజంలో కూడా భార్యల చిన్న చిన్న కోరికలను గుర్తించలేని భర్తలందరికి ఈ సీన్ బాగా కనెక్ట్ అవుద్ది.

‌5)ఇక సినిమా లో అతి కీలకమైన సన్నివేశం హీరో నితిన్ పెళ్లి మంత్రాల ప్రాశస్త్యం గురించి చెప్పడం ,ఆ తరువాత ప్రకాష్ రాజ్ లో పరివర్తన వచ్చి పశ్చాత్తాపo వ్యక్తం చేయడం నాకు బాగా నచ్చింది .అతని పశ్చాత్తాపమే ఈ సినిమా లక్ష్యం .
‌6)ఇక ఇందులో సెకండ్ హీరోయిన్ నందితా శ్వేత బావ మీద ప్రేమను మనసులోనే దాచుకొని చివరకు తట్టుకోలేక బరస్ట్ అయ్యే సీన్ చాలా బాగుంటుంది. ఆ సీన్ నేనెంత బాగా రాసానో నందితా శ్వేత అంత బాగా చేసింది.

7)ఇందులో హీరోయిన్ రాశీ ఖన్నా మొదట ఒక మధ్య తరగతి అమ్మాయిగా పరిచాయమౌతుంది. పిజ్జా షాప్ లో సేల్స్ గర్ల్ గా,స్విగ్గీ డెలివరీ గర్ల్ గా హీరోకు అతని ఫ్రెండ్స్ కు పరిచయమౌతుంది. కానీ నిజానికి ఆమె బ్యాగ్రౌండ్ వేరు. ఆమె నిజమైన నేపధ్యం ఏమిటో రివీల్ చేసే ఐడెంటిటీ ఓపెనింగ్ సీన్ నాకు బాగా నచ్చింది.నా సినిమాలోనే కాదు ..చాలా సినిమాల్లో ఇలా ఐడెంటిటీ ఓపెన్ అయ్యే సీన్స్ భలే థ్రిల్ గా అనిపిస్తాయి .

ఇవీ తన “శ్రీనివాస కళ్యాణం”లో తనకు నచ్చిన సన్నివేశాల గురించి దర్శకుడు సతీష్ వేగేశ్న ‘తెలుగు ఫిల్మ్ నగర్ డాట్ కామ్ ‘ తో షేర్ చేసుకున్న విశేషాలు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here