సినిమా యూనిట్ మెంబర్స్ కు కీర్తి సురేష్ కానుక

Keerthy Suresh Gifts To Movie Unit Members,Telugu Flimnagar,Tollywood Cinema Latest News,Latest Telugu Movie,Telugu flim Updates,Keerthy Suresh Gifts Gold Coins,Actress Keerthy Suresh Latest News,Young Heroine Keerthy Suresh Gifts Gold Coins to Movie Unit Members,Keerthy Suresh Gifts to Tollywood Member,Keerthy Suresh Special Gifts
Keerthy Suresh Gifts To Movie Unit Members

మలయాళ సినిమాలలో బాలనటి గా నటించిన కీర్తి సురేష్,గీతాంజలి మలయాళ సినిమా తో హీరోయిన్ గా మారారు.ఇదు ఎన్నమాయం సినిమాతో తమిళ్ చిత్ర సీమకు హీరోయిన్ గా ఎంటర్ అయ్యారు. నేను శైలజ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. కీర్తి సురేష్ నటించిన నేను లోకల్,నటి సావిత్రి బయోపిక్ మూవీ మహానటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మహానటి సినిమాలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసినందుకు కీర్తి సురేష్ క్రిటిక్స్,ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.

సామి2 ,సండకోళి 2 (పందెంకోడి )తమిళ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ఎన్టీఆర్ లో గెస్ట్ రోల్ లో నటిస్తున్నారు. కొంతమంది స్టార్ హీరోలు తమ సినిమా షూటింగ్ ఆఖరి రోజు ఆ సినిమా యూనిట్ మెంబర్స్ కు కానుకలు ఇస్తారు. హీరోయిన్ కీర్తి సురేష్
అదే సాంప్రదాయానికి తెర తీశారు.మహానటి సినిమా షూటింగ్ చివరి రోజున సినిమా యూనిట్ కు గోల్డ్ కాయిన్స్ కానుకగా ఇచ్చారు. ఇప్పుడు సండకోళి 2 తమిళ సినిమా షూటింగ్ చివరి రోజున యూనిట్ మెంబర్స్ కు గోల్డ్ కాయిన్స్ పంచిపెట్టారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here