శ్రీనివాస కళ్యాణం తో ఫ్యామిలీ ఫీల్ గుడ్ జోనర్ లో హ్యాట్రిక్ కొట్టిన దిల్ రాజు

latest telugu movies news, Srinivasa Kalyanam Movie Public Talk, Srinivasa Kalyanam Movie Review, Srinivasa Kalyanam Movie Review & Rating, Srinivasa Kalyanam Movie Story, srinivasa kalyanam review, Srinivasa Kalyanam Telugu Movie Live Updates, Srinivasa Kalyanam Telugu Movie Public Response, Srinivasa Kalyanam Telugu Movie Review, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Srinivasa Kalyanam Review

తల్లిదండ్రులు పిల్లల మధ్య ఏర్పడే కమ్యూనికేషన్ గ్యాప్ ను కథాంశంగా తీసుకొని చేసిన ‘బొమ్మరిల్లు’, డాలర్ డ్రీమ్స్ లో మునుగుతూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు కనువిప్పు కలిగించే కథతో దిల్ రాజు నిర్మించిన ‘ శత మానంభవతి ‘ ఫీల్ గుడ్ ఫామిలీ ఎంటర్టైనర్స్ జోనర్లో ఎంత సంచలన విజయాలను సాధించాయో తెలిసిందే .ఇప్పుడు అదే ఫామిలీ జోనర్ లో మన వైవాహిక వ్యవస్థలోని ఔన్నత్యాన్ని, శాస్త్రోక్త వివాహ వేడుకల లోని సాంప్రదాయ సౌందర్యాన్ని తెరకెక్కించే ప్రయత్నమే ‘శ్రీనివాస కళ్యాణం’. శతమానంభవతి’ ఆహ్లాదకర విజయం తర్వాత దర్శకుడు సతీష్ వేగేశ్న తో దిల్ రాజు బ్యాక్ టూ బ్యాక్ చేస్తున్న సినిమా కావటంతో ‘శ్రీనివాస కళ్యాణం’ మీద ఆ దర్శక నిర్మాతలకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ప్రేక్షకులకు అంతకు మించిన అంచనాలు ఉన్నాయి. ఇక హీరో పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే కొన్ని వరస ఫ్లాప్స్ తో కొంచెం వెనక పడిన నితిన్ కు శ్రీనివాస కళ్యాణం ‘ ‘అ ఆ ‘లాంటి ఆహ్లాదకర విజయంగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇన్ని అంచనాల నడుమ ఈ రోజు విడుదలైన ‘శ్రీనివాస కళ్యాణం ‘ ఎలా ఉందో చూద్దాం .

కథాంశం: 

ఎన్నెన్నో సినిమాలలో చూసేసిన పెళ్లి ప్రాశస్త్యం గురించి కొత్తగా చెప్పేదేమిటీ ..కొత్తగా చూసేదేమిటి అనుకుంటూ ఈ సినిమాకు వెళ్ళేవాళ్లకు పెళ్లి అంటే ఇదా …ఇంత సంప్రదాయ సౌందర్యాన్ని మనం వదిలేస్తున్నమా? ఇంత నిర్లక్యం చేస్తున్నమా ? అనే పశ్చాత్తాపం కలిగి తీరుతుంది . నిజానికి ఇందులో కథగా చెప్పటానికి ఏమీ లేదు.పెళ్లి అంటే ఏమిటో …పెళ్లి వేడుకలో ఉన్న సంప్రదాయ విలువలు ఏమిటో చిన్నప్పుడు నాయనమ్మ (జయసుధ) చెప్తుంటే విన్న శ్రీనివాసరారాజు /వాసు (నితిన్) మనసులో అలా నాటుకుపోతాయి .తనతో పాటే పెరిగిన ఆ సంప్రదాయ గౌరవాన్ని తన పెళ్లిలో ,తన జీవితంలో కూడా పాటించాలి అన్నది వాసు లక్ష్యం. ఉద్యోగరీత్యా చండీగఢ్ లో ఉన్న వాసుకు ప్రియ (రాశీ ఖన్నా )ఒక మధ్య తరగతి వర్కింగ్ విమెన్ గా పరిచాయమౌతుంది.ఇద్దరి పరిచయం ప్రేమగా మారే సమయానికి ఆమె ఒక మల్టీ మిల్లియనియర్ అయిన బిజినెస్ టైకూన్ కృష్ణ ప్రసాద్ కూతురని తెలుస్తుంది.

టైం ఈస్ మనీ అంటూ సంపాదన వెనుక పరుగులు పెట్టే ప్రకాష్ రాజ్ బలవంతగా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటాడు .కానీ షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా కొన్ని కండీషన్స్ పెడతాడు. తన కుమార్తె భవిష్యత్ లో ఎప్పుడైనా విడిపోవాలనుకుంటే అప్పుడు విడాకుల కోసం నీ వెనక తిరిగే టైం నాకు ఉండదు కాబట్టి ముందుగానే విడాకుల కాగితాల మీద సంతకం చేయమంటాడు. అప్పుడు వాసు కూడా ఒక కండీషన్ చెప్పి దానికి ఒప్పుకుంటే అడ్వాన్స్ డివోర్స్ పేపర్ మీద సంతకం పెడతానంటాడు. వాసు పెట్టిన కండీషన్ చాలా సింపుల్ అనుకుని దానికి ఒప్పుకుంటాడు ప్రకాష్ రాజ్. ఇదీ ఇంటర్వెల్ బ్లాక్. ఇంటర్వెల్ తరువాత ప్రారంభమౌతాయి అసలైన పెళ్లి పనులు. ఇంతకూ ప్రకాష్ రాజ్ కు వాసు కు మధ్య జరిగిన ఒప్పందం ఏమిటీ? పెళ్లితంతు లో ప్రకాష్ రాజ్ పాత్ర ఏమిటి ? డబ్బుకు కాలానికి ముడిపెట్టి అదే సర్వస్వం గా భావించే ప్రకాష్ రాజ్ కు వాసు మన వివాహ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని ఎలా చెప్పి ఎలా కనువిప్పు కలిగించాడు అన్నది ఇంటర్వెల్ తరువాత జరిగే కథ.

 దర్శకత్వం :

ఎన్నో సినిమాల్లో ఎందరో దర్శకులు చెప్పేసిన పాయింట్ తీసుకుని మరల పెళ్లి మీద ఇంత చక్కని కొత్త వ్యూ పాయింట్ లో చెప్పవచ్చని డేర్ చేసిన ఈ చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న కు హాట్స్ ఆఫ్ చెప్పాలి. టైటిల్ కార్డ్స్ పడుతున్నప్పుడు శోభన్ బాబు,చంద్రకళ నటించిన సంపూర్ణ రామాయణం లో సీతారాముల స్వయవర ఘట్టాన్ని, యన్.టి. ఆర్. కృష్ణకుమారిల రుక్మిణీ పరిణయ ఘట్టాన్ని,వేంకటేశ్వర మహాత్యంలో యన్.టి. ఆర్. సావిత్రి నంటించిన కళ్యాణ ఘట్టాన్ని చాలా సెన్సిబుల్ గా వాడారు సతీష్ వేగేశ్న. బ్లాక్ అండ్ వైట్ లో ఆ విజువల్స్ చూసి ముఖ్యంగా “యన్.టి. ఆర్. దివ్యమంగళ రూపాన్ని చూసి ‘గూస్బమ్స్’ లో ఉన్న ప్రేక్షకులకు మెల్లగా కథను ,పాత్రలను పరిచయం చేశాడు సతీష్. తొలి సగాన్ని పాత్రల పరిచయానికి వాడుకొని సెకండ్ హాఫ్ లోని ప్రతి సన్నివేశాన్ని,ప్రతి సందర్భాన్ని చాలా సెన్సిబుల్ గా ప్రెసెంట్ చేసాడు . నిజానికి ఈ దశలో ఈ సినిమాను యటంప్ట్ చేయడం దర్శకనిర్మాతలు ఇద్దరికి అగ్నిపరీక్షే .డబ్బున్న వాళ్ళ పెళ్లిళ్లు ఎలాగూ వారం రోజుల పాటు ఇంతకంటే ఘనంగా నే జరుగుతున్నాయి కదా…మరి ఈ సినిమాలో పెళ్లి గురించి కొత్తగా చెప్పేదేమిటీ…!? అనుకుంటే పొరపాటు. ఇందులో చెప్పింది ఘనంగా ,ఆడంబరంగా పెళ్లి చేసుకోవడం గురించి కానే కాదు…సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకోవటం గురించి. ఒక పెళ్లి గురించే కాదు బంధుత్వాలు,అనుబంధాల విలువను మరో కోణంలో ఆవిష్కరించిన ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ . మన ఇళ్లలో మన పెళ్లిళ్లలో డబ్బున్న వాళ్లకు గొప్ప మర్యాదలు,డబ్బు లేనివాళ్లకు తక్కువ మర్యాదలు చేస్తుంటారు. పెళ్లి కార్డుల పంపకం మొదలు పిలుపులు,భోజనాలు,పెట్టిపోతలు ఇలా ప్రతి విషయంలోనూ వివక్షను చూపిస్తుంటారు. దీన్ని గురించి హీరో వాసు క్యారెక్టర్ ద్వారా పాస్ చేసిన మెసేజ్ చాలా అర్ధవంతంగా ఉంది.ఇదే కాదు పెళ్లి గురించి మాకు అంతా తెలుసు అనుకునే వాళ్ళకు ఇంకా ఎంతో తెలుసుకోవాలని ఆహ్లాదంగా చెప్పిన సతీష్ వేగేశ్న కు అభినందనలు.

అదర్ హైలైట్స్ :

ఒక కథను జడ్జ్ చేయటంలో నిర్మాత దిల్ రాజు అంచనాలు 90 పర్సెంట్ పైగా సక్సస్ అవటం అభినందనీయం .నిజానికి చాలా ఓపికగా ,జాగ్రత్తగా డీల్ చేయకపోతే   ఈ శ్రీనివాస కళ్యాణం స్క్రిప్ట్ లో డాక్యుమెంటరీ ఫీచర్స్ ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. ఎవ్వరికీ ఇంట్రెస్ట్ లేని మేటర్ ను ఇంటరెస్ట్ గా చెప్పడం మామూలు విషయం కాదు .అయితే దిల్ రాజు లో ఉన్న స్క్రిప్ట్ జడ్జింగ్ కెపాసిటీ వల్లనే ఇలాంటి ఫీల్ గుడ్ ప్రాజెక్టులు పాసిబుల్ అవుతున్నాయి.ఇది ఎక్కువగా టెక్స్ట్ బేస్డ్ సినిమా నే అయినప్పటికీ అవసరమైన దగ్గర డబ్బు వెదజల్లిన దిల్ రాజు మేకింగ్ స్టాన్డెర్డ్స్ ను అభినందించాలి.

నటీనటుల పర్ఫార్మన్స్ :

మంచి కం బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న  హీరో నితిన్ కు ఇది మంచి వర్కౌట్ . పెర్ఫార్మన్స్ పరంగా ఇందులో నితిన్,ప్రకాష్ రాజ్,జయసుధ ,రాశీ ఖన్నా ,నందిత శ్వేతా లవి మాత్రమే స్కోప్ ఉన్న పాత్రలు . ఎయిర్ బస్ లాంటి   మిగిలిన చాలా పాత్రలు పాత్రధారులు ఫ్రేమ్ ఫిల్లింగ్ పర్పస్ …బావ అయిన హీరో ను ప్రేమించి అతనికి చెప్పలేక చివరకు బరస్ట్ అయ్యే సన్నివేశంలో నందితా శ్వేతా చాలా బాగా చేసిందన్నది ప్రత్యేక ప్రశంస .

ఇక టెక్నికల్ గా చెప్పలంటే మిక్కీ జె మేయర్ సంగీతం,సమీర్ సినిమాటోగ్రఫీతో పాటు అన్ని అంశాలు చక్కగా అమిరిన వెల్ మేడ్ ఫిల్మ్ “శ్రీనివాస కళ్యాణం “.

శ్రీనివాస కళ్యాణం మూవీ రివ్యూ
  • Story
  • Direction
  • Screenplay
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here